Posted on 2026-02-19 19:15:41
ప్రాంత అభివృద్ధి కోసం ఎక్కడికైనా వెళ్తా...
గ్రామ అభివృద్ధి కోసం మీరు కూడా నాతో కలసి రండి
సంవత్సరంలో ఒక నెల గ్రామాభివృద్ధికి కేటాయించండి
ప్రముఖ వ్యాపార వేత్త తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి
డైలీ భారత్, కామారెడ్డి:కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో సామాజిక దృక్పథంతో పలు గ్రామపంచాయతీ కార్యాలయాలకు ఫర్నిచర్ అందజేయాలన్న దృక్పథంతో ప్రముఖ వ్యాపార వేత్త తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి విశిష్ట కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. గ్రామీణ పరిపాలన వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో, తన సొంత ఖర్చుతో ప్రతి గ్రామ పంచాయతీకి సుమారు రూ. 2.లక్షల విలువైన ఆధునిక ఆఫీస్ ఫర్నిచర్‌ను అందించేందుకు ముందుకు వచ్చారు. కాగా గ్రామ పంచాయతీలు ప్రజలకు అందించే సేవలు మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా కొనసాగేందుకు తగిన వసతులు అవసరమని భావించిన సుభాష్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. గ్రామ సర్పంచ్‌లు, కార్యదర్శులు, సిబ్బంది కార్యాలయాల్లో సౌకర్యవంతంగా పనిచేయడానికి అవసరమైన టేబుళ్లు, కుర్చీలు వంటి సామగ్రిని ఆయా గ్రామాల సర్పంచులు పాలకవర్గాలకు అందజేశారు . ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి సంవత్సరంలో కేవలం ఒక నెల రోజులు కేటాయించి అభివృద్ధికై పాటుపడండి అని పిలుపునిచ్చాడు. ప్రభుత్వాలను నిద్రలేపే విధంగా పని చేద్దామని ఎవరూ చేయని సాహసాన్ని మనం చేసిన రోజే విజయం మన దరికి వస్తుందని ఆయన తెలిపారు. ఈ క్రమంలో గురువారం మొదటి విడతగా సుమారు 50 నుండి 60 గ్రామ పంచాయతీలకు ఫర్నిచర్ పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు,పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సేవా కార్యక్రమం ద్వారా గ్రామ పంచాయతీ కార్యాలయాల రూపురేఖలు మారి, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం కలుగుతుంది. గ్రామీణాభివృద్ధి పట్ల తన అంకితభావాన్ని మరోసారి చాటుకుంటూ, ప్రజాసేవే పరమావదిగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టిన సుభాష్ రెడ్డి ని స్థానిక ప్రజలు, నాయకులు అభినందించారు.వారు మాట్లాడుతూ
ఇకపై కూడా కామారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి కోసం విద్య, ఆరోగ్యంవంటిమౌలిక వసతులకు గాను ఎల్లవేళలా తన ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని ఆయన తెలియజేశారు అంతేకాకుండా భవిష్యత్తులో అనేక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో నియోజకవర్గ అభివృద్ధి కొరకై ప్రజా పిలుపు మేరకు రాజకీయ అరంగేట్రం కూడా సిద్ధమవుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఎమ్మెల్యే ఎంపీ స్థానాలకు కూడా తాను పోటీ చేయనున్నట్లు చెప్పకనే చెప్పారు.
కార్యక్రమంలో గాయకులు మిట్టపల్లి సురేందర్, మాజీ డిసిసిబి వైస్ ప్రెసిడెంట్ ఇంద్రసేనారెడ్డి కాచాపూర్ మాజీ సింగిల్ విండో చైర్మన్ కిష్టా గౌడ్, దోమకొండ సింగిల్ విండో చైర్మన్ నాగరాజు రెడ్డి,పెద్ద మల్లారెడ్డి సింగిల్ విండో చైర్మన్ రాజా గౌడ్,మాజీ వైస్ ఎంపీపీ రవీందర్ రెడ్డి, జనగామ గ్రామ సర్పంచ్ మట్ట శ్రీనివాస్, ఉప సర్పంచ్ స్వామి,మాజీ సర్పంచ్ వెంకట్ గౌడ్ నెల్లూరు రాజారెడ్డి, కమలాకర్ రెడ్డి, వెంకా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు
Posted On 2026-05-30 22:26:06
Readmore >