Posted on 2026-02-18 11:54:20
డైలీ భారత్, వనస్థలిపురం: పట్టపగలే వనస్థలిపురంలో దారుణం..ఇంట్లోకి చొరబడి మహిళ దారుణ హత్య.విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకుందన్న కక్షతో వనస్థలిపురంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సునీతను ఆమె మాజీ భర్త మహేష్ అతి కిరాతకంగా హత్య చేశాడు..
వనస్థలిపురంలో దారుణం చోటుచేసుకుంది. గ్రీన్ సిటీ కాలనీ లో నివసిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సునీత ను ఆమె మాజీ భర్త మహేష్ అతి కిరాతకంగా హతమార్చాడు చేశాడు. విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకుందన్న కక్షతోనే మహేష్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. మహేష్ విదేశాల్లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. సునీత, మహేష్‌ల మధ్య 5 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే, ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో కొన్నాళ్ల క్రితం సునీత అతనికి చట్టబద్ధంగా విడాకులు ఇచ్చేసి మరో వ్యక్తిని వివాహం చేసుకుని గ్రీన్ సిటీ కాలనీలో నివసిస్తోంది.
సునీత రెండో పెళ్లిని జీర్ణించుకోలేకపోయిన మహేష్, ఆమెపై విపరీతంగా పగ పెంచుకున్నాడు. ఎలాగైన అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఇవాళ మధ్యాహ్నం రెండు పదునైన కత్తులు, పెట్రోల్ డబ్బాతో సునీత నివాసంలోకి చొరబడ్డాడు. అడ్డువచ్చిన వారిని పెట్రోల్ పోసి తగలబెడతానని బెదిరిస్తూ బీభత్సం సృష్టించాడు. అనంతరం ఇంట్లోకి ప్రవేశించిన మహేష్, సునీతపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేయగా ఆమె కుప్పకూలిన తర్వాత కూడా వదలకుండా, అక్కడే ఉన్న పూలకుండీతో తలపై బలంగా కొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో సునీత విలవిలాడుతూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.స్థానికుల సమాచారంతో వెంటనే రంగంలోకి దిగిన వనస్థలిపురం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.నిందితుడు మహేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.పట్టపగలే కాలనీలో హత్య జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు.
ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >
చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...
Posted On 2026-08-07 15:27:03
Readmore >
కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి
Posted On 2026-08-07 14:58:17
Readmore >
పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-07 14:53:14
Readmore >
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >