| Daily భారత్
Logo




పోలింగ్ ప్రక్రియను పకట్బందీగా చేపట్టాలి : ఎన్నికల అబ్జర్వర్ మయంక్ మిట్టల్

News

Posted on 2026-02-05 16:47:24

Share: Share


పోలింగ్ ప్రక్రియను పకట్బందీగా చేపట్టాలి : ఎన్నికల అబ్జర్వర్ మయంక్ మిట్టల్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఫిబ్రవరి 11వ తేదీన నిర్వహించే మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రతి ఒక్కరూ  బాధ్యత గా పని చేయాలని సంబంధిత అధికారులకు ఎన్నికల అబ్జర్వర్ మయంక్ మిట్టల్ సూచించారు. 

గురువారం శంకర్ పల్లి మున్సిపాలిటీకి సంబంధించిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ సెంటర్, పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల అబ్జర్వర్ మయంక్ మిట్టల్, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సి.నారాయణ రెడ్డితో కలిసి పరిశీలించారు. 

  ఈ సందర్బంగా ఎన్నికల అబ్జర్వర్ మయంక్ మిట్టల్, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సి.నారాయణ రెడ్డి శంకర్ పల్లి  మున్సిపాలిటీకి సంబంధించిన ఏర్పాట్లను, ఎన్నికల సామగ్రిని పరిశీలిస్తు అధికారులకు సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఎన్నికలకు సంబంధించిన స్టేషనరీ తదితర అంశాలను మున్సిపల్ కమిషనర్ యోగేష్ ను అడిగి తెలుసుకొని వాటిని పరిశీలించారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి అన్నీ వసతులు కల్పించాలని, స్ట్రాంగ్ రూమును, కౌంటింగ్ హాల్ ను, పోలింగ్ నిర్వహించే పాఠశాలను పరిశీలించారు. ఎన్నికలు సజావుగా జరిగే విధంగా అధికారులు, సిబ్బంది అందరూ కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. డిస్ట్రిబ్యూషన్ ఏర్పాట్లు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, కౌంటింగ్ ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ వివరించారు.  

 కలెక్టర్ వెంట శంకర్ పల్లి తహశీల్దార్, సంబంధిత అధికారులు,  తదితరులు ఉన్నారు.

Image 1

ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!

Posted On 2026-08-09 08:27:49

Readmore >
Image 1

ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!

Posted On 2026-08-09 08:09:49

Readmore >
Image 1

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

Posted On 2026-08-09 06:28:48

Readmore >
Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >
Image 1

విద్యావంతుడు ఎమ్మెల్యే అయినా నియోజకవర్గంలో విద్య శూన్యం..?

Posted On 2026-08-08 16:04:38

Readmore >
Image 1

రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్

Posted On 2026-08-08 14:28:17

Readmore >