| Daily భారత్
Logo




నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పై జెండా ఎగరేసేది ఎవరు

News

Posted on 2026-01-31 13:07:56

Share: Share


నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పై జెండా ఎగరేసేది ఎవరు

కాంగ్రెస్, బిజెపి పార్టీల మధ్య రసవత్తర పోరు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా పిసిసి చీఫ్ అడ్డా..అందరి చూపు ఆ జిల్లా పైనే ఉంది.. అలాంటి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం ను కైవసం చేసుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది... అంతేగా భారతీయ జనతా పార్టీ కూడా వ్యూహ ప్రతి వ్యూహాలు రచిస్తోంది.గత మున్సిపల్ ఎన్నికల్లో అన్ని పార్టీల కన్నా అత్యధికంగా 28 స్థానాలను స్థానిక ఎంపి ధర్మపురి అరవింద్ వ్యూహం తో  కైవసం చేసుకున్న భారతీయ జనతా పార్టీ ఈ సారి నువ్వా నేనా అన్న రీతిలో పోటీ పడుతోంది.

రాష్ట్రంలోనే మూడున్నర లక్షల మంది అత్యధిక ఓటర్లు ఉన్న నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పీఠం కోసం ద్విముఖ పోటీ అధికార కాంగ్రెస్ పార్టీ,బిజేపి పార్టీ ల మధ్యే ఉండబోతుంది.

మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో రాజకీయ వాతావరణం మరింత హీటెక్కింది. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్. బీజేపీ మధ్య త్రిముఖ పోరు సాగనుంది. ఇది వరకే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన పార్టీలు.. కమిటీలు వేసుకొని గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. అయితే నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ స్థానం కాంగ్రెస్ పార్టీకి కీలకంగా మారనుంది. రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ సొంత ఇలాకాలో మేయర్ పీఠం గెలవడం ప్రతిష్టాత్మకం కావడంతో ఆయన సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. పైగా ఇక్కడ బీజేపీ నుంచి గట్టి పోటీ ఉంది. మేయర్ పీఠంపె గురిపెట్టిన నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ మాత్రం అది గెలిచి చూపించి జిల్లాపై మరింత పట్టు నిలుపుకోవాలని భావిస్తున్నారు.

నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్లో 60 డివిజన్లు ఉండగా, మొత్తం 3.48 లక్షల మంది ఓటర్లున్నారు. సొంత జిల్లాలో మేయర్ స్థానం గెలవడం పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ కు అత్యంత కీలకంగా మారింది. క్యాడర్ పై, నాయకులపై మరింత పట్టు సాధించుకోవడంతోపాటు ఆయన నాయకత్వానికి ప్రత్యక్ష రిఫరెండమ్ లాంటిది. అందుకే ఈ మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మిగతా మున్సిపాల్టీలతో పోలిస్తే నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్లో ఇక్కడ గట్టిగానే పోటీ ఉంది.ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ఆయన జిల్లాలో వరుస పర్యటనలు నిర్వహిస్తున్నారు. డీసీసీ అధ్యక్షులతో, ముఖ్య నాయకులతో, ఆశావహులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్లమెంట్ వారీగా స్క్రీనింగ్ కమిటీలు ఎంపిక చేయగా.. తొలి సమావేశం సైతం నిజామాబాద్ పార్లమెంట్ స్థానంపైనే పెట్టడం విశేషం.

కాంగ్రెస్లో బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ప్రస్థానం విద్యార్థి దశలో ఎన్ఎస్ యూఐతో ప్రారంభమైంది. పార్టీకి విధేయుడిగా ఉంటూ వచ్చారు. 1994లో డిచ్పల్లి నియోజకవర్గం (ప్రస్తుతం నిజామాబాద్ రూరల్), 2014లో నిజామాబాద్ అర్బన్ నుంచి అసెంబ్లీ బరిలో నిలిచి ఓడిపోయారు.ప్రత్యక్ష ఎన్నికల్లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గెలవలేదనే అపవాదు ఉంది. రెండేండ్ల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అర్బస్ సీటును షబ్బీర్ అలీకి త్యాగం చేయడంతో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అయ్యారు. అనంతరం పీసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు వరించిన విషయం తెలిసిందే.

నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో నాలుగు పర్యాయాలుగా (22 ఏండ్లుగా) కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. 1999-2004 వరకు డి.శ్రీనివాస్ తర్వాత ఇప్పటి వరకు కాంగ్రెస్ గెలవలేదు. ఆ ప్రభావం మున్సిపల్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తూ వచ్చింది. గత ఎన్నికల్లో సైతం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కేవలం 2 సీట్లు గెలవగా, బీఆర్ఎస్ 13, ఎంఐఎం 16, బీజేపీ 28, ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. ఇటీవల కాంగ్రెస్ పుంజుకోవడం, ఉప ఎన్నికల్లో గెలుపొందడం, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో కొంత మార్పు వచ్చిందన్న అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. ఈ నేపథ్యంలో పోటీ చేసేందుకు ఆశావహుల నుంచి దరఖాస్తులు వెల్లువగా వచ్చాయి. 60 డివిజన్లకు దాదాపు 700 దరఖాస్తులు రావడం గమనార్హం. పార్టీని అంటిపెట్టుకొని, ప్రజల్లో పలుకుబడి ఉన్న వారికే టికెట్ ఇస్తామంటున్నారు. ఇది వరకే సర్వేలు సైతం నిర్వహించారు. దాదాపు 40 సీట్లు గెలవడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులతో కలిసి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.

మరో పక్క బిజేపి ఒక ప్రత్యేకమైన నినాదంతో *మన ఇందూరు మన మేయర్* అంటూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది.బిజేపికి కాకుండా ఎవరికి ఓటేసినా ఎంఐఎం మేయర్ పీఠం ను తన్నుకుపోతుందని జోరుగా ప్రచారం చేస్తోంది.పైగా ఓట్లు మలచుకోవడానికి హిందూత్వ వాదం ఉండనే ఉంది.గతంలో 28 సీట్లు గెలిచాం మరింత కష్టపడితే 40 సీట్లు సాధించి ఎట్టిపరిస్థితుల్లోనూ మేయర్ పీఠం దక్కించుకుంటామని అరవింద్ వ్యూహం రచిస్తున్నారు.

ఇక బిఆర్ఎస్,ఎం.ఐ.ఎం పార్టీలు సైతం మేయర్ పీఠం ను కైవసం చేసుకునేంతగా బలం లేకున్నా గతంలో దక్కించుకున్న స్థానాలు బీఆర్ఎస్ 13, ఎంఐఎం 16 కు తగ్గకుండా పరువు కాపాడుకోవడం కోసం వెంపర్లడుతున్నాయి.

Image 1

అంతర్రాష్ట్ర నేరస్థులు అరెస్టు

Posted On 2026-06-25 20:20:58

Readmore >
Image 1

సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం : డాకడియం కావ్య, ఎంపీ, వరంగల్

Posted On 2026-06-25 18:57:28

Readmore >
Image 1

రూ.107 కోట్ల‌తో మ‌రో 4 చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ‌

Posted On 2026-06-25 18:54:05

Readmore >
Image 1

యువతే దేశ భవిష్యత్తు...

Posted On 2026-06-25 18:38:19

Readmore >
Image 1

జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను తప్పక సాధించాలి : డి ఎం హెచ్ వో డాక్టర్ జె వెంకటి

Posted On 2026-06-25 18:35:11

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొరత లేదు : ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-06-25 18:33:22

Readmore >
Image 1

ఆపరేషన్ కవచ్‌లో కామారెడ్డి పోలీసుల పంజా

Posted On 2026-06-25 18:31:09

Readmore >
Image 1

ఈ నెల 28 నుంచి 30వ తేది వరకు పల్స్ పోలియో : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-06-25 18:23:12

Readmore >
Image 1

ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారం నింపాలి.. పాస్ పోర్ట్ సైజ్ ఫొటో ఇవ్వాలి

Posted On 2026-06-25 18:21:26

Readmore >
Image 1

వరంగల్ : అక్రమ పచ్చడి తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ దాడి

Posted On 2026-06-25 18:18:41

Readmore >