| Daily భారత్
Logo




ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ బిజెపి

News

Posted on 2026-01-29 13:25:51

Share: Share


ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ బిజెపి

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మన ఇందూరు మన మేయర్ నినాదంతో ముందుకెళ్దాం

బిజెపి అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ వెల్లడి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: దేశ ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా గత మూడు ధపాలుగా ప్రధానిగా దేశాన్ని పరిపాలిస్తూ ఏమాత్రం అవినీతి లేని దేశంగా భారతదేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతున్నారని నిజామాబాద్ అర్బన్  ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ  పేర్కొన్నారు. గురువారం బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి అధ్యక్షతన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ సమక్షంలో నగరంలోని 22వ డివిజన్ నుండి మాజీ కార్పొరేటర్ పోతుల పురుషోత్తo, అదే డివిజన్ నుండి తాటికొండ రాము, ఆకుల శ్రీనివాస్, రాజ్ కుమార్, గౌత ఆనంద్, కుందన్ శ్రీనివాస్ లతో పాటు సుమారు 200 మంది డివిజన్ వాసులు బిజెపి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మన ఇందూర్ మన మేయర్ అనే నినాదంతో బిజెపి శ్రేణులు ప్రతి డివిజన్ లో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. బిజెపి పార్టీ అంటేనే అభివృద్ధి అని అభివృద్ధి అంటేనే బిజెపి పార్టీ అని ఆయన కొనియాడారు. ముఖ్యంగా ఎంపీ అరవింద్ జిల్లాలో చేస్తున్న విస్తృత అభివృద్ధి పనులకు ఆకర్షితులై, మున్సిపల్ ఎన్నికలకు ముందు బిజెపి పార్టీలో చేరడం శుభపరిణామం అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఉజ్వల్ యోజన కింద గ్యాస్ సిలిండర్లు తక్కువ ధరకే అందివ్వడం, అలాగే చిరు వ్యాపారులకు ముద్ర లోన్ పథకం కింద లక్ష రూపాయల వరకు రుణ సదుపాయాలు అందివ్వడం, వాటి ద్వారా చిన్న, మధ్య తరగతి ప్రజలు స్వతహాగా వ్యాపారాలు నిర్వహించుకునేందుకు ఈ రుణాలు ఎంతగానో దోహదపడుతున్నాయని ఆయన అన్నారు. అదేవిధంగా కేవలం 14 రూపాయలతో దేశ ప్రజలకు ప్రధాని మోడీ  రెండు లక్షల జీవిత బీమా కల్పించడం ప్రపంచంలో ఎక్కడా లేదని ఆయన స్పష్టం చేశారు. ఇక రాబోయే రోజుల్లో కచ్చితంగా మున్సిపల్ కార్పొరేషన్ పై బిజెపి జెండా ఎగరవేయడం ఖాయమని ఈ చేరికల ద్వారా తనకు పూర్తి నమ్మకం కలుగుతుందని ఆయన దీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 22వ డివిజన్ నుండి సుమారు 200 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బిజెపి పార్టీలో చేరారు. ఇదిలా ఉండగా 22వ డివిజన్ మహిళా మణులు రాబోయే రోజుల్లో బిజెపి వైపే తాముంటామని ఎమ్మెల్యే కి భరోసా కల్పించారు.

Image 1

కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-08-09 18:12:44

Readmore >
Image 1

వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!

Posted On 2026-08-09 12:53:35

Readmore >
Image 1

ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!

Posted On 2026-08-09 08:27:49

Readmore >
Image 1

ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!

Posted On 2026-08-09 08:09:49

Readmore >
Image 1

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

Posted On 2026-08-09 06:28:48

Readmore >
Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >