Posted on 2026-01-29 06:00:01
ఒరిస్సా నుంచి కేరళకు కారు లో గంజాయి తరలింపు స్వాధీన పరుచుకున్న ఎక్స్పోర్ట్ మెంట్
నిందితుల నుంచి రూ. 17 వేలు స్వాధీనం.
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో ఒరిస్సా మల్కాన్గిరి జిల్లా నుంచి కేరళకు కారులో అక్రమంగా ప్రభుత్వా నిషేధిత గంజాయి తరలిస్తున్నటువంటి గంజాయిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది పట్టుకున్నారు. 50.4 కేజీల గంజాయి తో పాటు రూపాయలు 17,000 నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ K.తిరుపతి ఆధ్వర్యం లో ఎస్సై సిహెచ్. హరిరావు మరియు సిబ్బంది కలిసి భద్రాచలం నుండి నెల్లిపాక రోడ్డు లో తనిఖీలు తనిఖీలు చేపట్టారు. భద్రాచలం ఇసుక రీచ్ సమీపం లో అనుమానాస్పదంగా కనిపించిన ఒక ఫ్లాట్ కారు ను ఆపి తనిఖీ చేయగా కారు లో కేజీల గంజాయి లభ్యమైంది. తదుపరి విచారణ లో ఇట్టి గంజాయి ని తిరువనంతపురం (కేరళ)కి చెందిన ఏ 1) అక్షయ్ సురేష్ , ఏ 2) కుంజుమాన్ సురేంద్రన్ మినిమోల్ మరియు ఏ 3) అనంత కృష్ణన్ లు ఒడిశా రాష్టం లోని మల్కాన్ గిరి నుండి తిరువనంతపురం (కేరళ) కు తరలిస్తున్నట్లు నిందితులు అంగీకరించారు.. తదుపరి విచారణ నిమిత్తం ఇట్టి గంజాయిని , ఫ్లాట్ కార్ ను , ముగ్గురు ముద్దాయిలను , 4 సెల్ ఫోన్లను మరియు రూ. 17 వేల నగదును సీజ్ చేసి ( వీటి మొత్తం విలువ 28 లక్షల 70 వేల రూపాయలు) భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్ లో అప్పగించడమైనది.. ఈ తనిఖీల లో హెడ్ కానిస్టేబుల్ యం.ఏ.కరీం, కానిస్టేబుల్స్ సుధీర్, వెంకట్, హనుమంతరావు, వీరబాబు , ఉపేందర్ లు ఉన్నారు. గంజాయిని పట్టుకున్న టీం ను తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం, స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జి.జనార్ధన్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ జి.గణేష్ అభినందించారు.
ఏదైనా గంజాయి కి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే ఎక్సైజ్ టోల్ ఫ్రీ నెంబర్ 18004252523 కు సమాచారం అందించగలరని, మీ వివరాలు గోప్యం గా ఉంచబడతాయి అని ఈ ఎస్ తిరుపతి తెలియజేశారు . ఈ కార్యక్రమంలో ఎక్స్పోర్ట్ మెంట్ సిబ్బంది పాల్గొన్నారు
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >