| Daily భారత్
Logo




తపస్ కామారెడ్డి జిల్లా కార్యనిర్వాహక సమావేశం నిర్వహణ

News

Posted on 2026-01-25 18:52:13

Share: Share


తపస్ కామారెడ్డి జిల్లా కార్యనిర్వాహక సమావేశం నిర్వహణ

డైలీ భారత్, కామారెడ్డి: తపస్ కామారెడ్డి జిల్లా కార్యనిర్వాహక సమావేశం జిల్లా అధ్యక్షులు భూనేకర్ సంతోష్ గారి అధ్యక్షతన స్థానిక శ్రీ సరస్వతి విద్యామందిర్ పాఠశాలలో  నిర్వహించబడింది.

ఈ సందర్భంగా తపస్ రాష్ట్ర కార్యదర్శి రాఘవ రెడ్డి గారు మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయుల సంక్షేమానికి సంబంధించిన పెండింగ్ బిల్లులు, పి.ఆర్.సి, పాత పెన్షన్ వంటి అంశాలపై ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటే ఉపాధ్యాయ సమాజానికి మేలు జరుగుతుందని తెలిపారు.

అలాగే 317 జీవో వల్ల భాధితులైన ఉపాధ్యాయులకు న్యాయం చేకూర్చడం అత్యవసరమని, దీనిపై ప్రభుత్వం సమగ్రంగా ఆలోచించి పరిష్కారం చూపాలని కోరారు. నూతన విద్యావిధానం అమలులో ఉపాధ్యాయుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని, విద్యా వ్యవస్థ బలోపేతానికి దోహదపడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

2010 కన్నా ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వడం సముచితమైన డిమాండ్ అని పేర్కొంటూ, దీనిపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో క్రింది తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించబడినాయి:

తపస్ జిల్లా కార్యవర్గాన్ని పూర్తి స్థాయిలో విస్తరించడం జరిగినది

పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించి పి.ఆర్.సి అమలు చేయుట 

నూతన విద్యావిధానం సవ్యంగా అమలు చేయుట

317 జీవో భాధితులకు న్యాయం చేకూర్చుట

సి.పి.యస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయుట

2010 కన్నా ముందు నియమితులైన వారికి టెట్ నుండి మినహాయింపు ఇవ్వుట

ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గారు, తపస్ రాష్ట్ర బాధ్యులు భాస్కరాచారి గారు పాల్గొన్నారు. జిల్లా బాధ్యులు రాజశేఖర్, ఆంజనేయులు, లక్ష్మీపతి, రాజకుమార్, మధు, వేదప్రకాష్, కృష్ణ తదితరులు, అలాగే వివిధ మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పవన్, మల్లేష్, స్వామి, శశిధర్, ఆంజనేయులు, సంతోష్ తదితరులు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు.

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం, ఉపాధ్యాయ సంఘాలు కలిసి సమన్వయంతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు.

Image 1

పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు

Posted On 2026-08-10 07:42:21

Readmore >
Image 1

నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య

Posted On 2026-08-10 07:40:54

Readmore >
Image 1

మిస్ యూనివర్స్ పోటీల్లో సత్తా చాటిన మాదినేని నిఖిత

Posted On 2026-08-10 07:39:20

Readmore >
Image 1

ఏపీలో జూనియర్ డాక్టర్ల నిరసనల హోరు...

Posted On 2026-08-10 07:37:01

Readmore >
Image 1

"నెలకొక మంచి పని... కామారెడ్డి విద్యార్థి రశ్వంత్‌కు 10వ నారాయణ సేవ"

Posted On 2026-08-10 03:31:22

Readmore >
Image 1

కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-08-09 18:12:44

Readmore >
Image 1

వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!

Posted On 2026-08-09 12:53:35

Readmore >
Image 1

ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!

Posted On 2026-08-09 08:27:49

Readmore >
Image 1

ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!

Posted On 2026-08-09 08:09:49

Readmore >
Image 1

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

Posted On 2026-08-09 06:28:48

Readmore >