| Daily భారత్
Logo




నిజామాబాద్ లో లా అండ్ ఆర్డర్ పరిస్థితి దారుణంగా తయారయింది

News

Posted on 2026-01-25 10:39:37

Share: Share


నిజామాబాద్ లో లా అండ్ ఆర్డర్ పరిస్థితి దారుణంగా తయారయింది

కాంగ్రెస్, బిజెపి పాలనలో మత విద్వేషాలు, ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు జరగడం దారుణం

నిజామాబాద్ మాజీ అర్బన్ ఎమ్మెల్యే  బిగాలా గణేష్ గుప్తా

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:  నిజామాబాద్ లో లా అండ్ ఆర్డర్ పరిస్థితి దారుణంగా తయారవుతుందని, కాంగ్రెస్ బిజెపి పాలనలో మత విద్వేషాలు, విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు జరగడం తనకు ఎంతో ఆవేదనకు గురిచేసిందని నిజామాబాద్ మాజీ అర్బన్ ఎమ్మెల్యే బిగాలా గణేష్ గుప్తా పేర్కొన్నారు. ఆదివారం బీ ఆర్ ఎస్ పార్టీ కార్యాలయం లో ఆయన మాట్లాడుతూ

మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్  ఆదేశాల మేరకు అధికార కాంగ్రెస్ పార్టీకి సమయం ఇచ్చామన్నారు. ఇపుడు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సమయం వచ్చిందన్నారు. బి ఆర్ ఎస్ పార్టీ పదేళ్ల కాలంలో నిజామాబాద్ నగరంలో కానీ వినీ ఎరుగని అభివృద్ధి చేసి చూపించామన్నారు. నగర అభివృద్ధికోసం 100 కోట్లు నిధులు 2022 సంవత్సరంలో బి ఆర్ ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఆ నిధులతో 60 డివిజన్లలో అభివృద్ధి పనులు చేపడితే బీజేపీ ఎమ్మెలే క్లెయిమ్ చేసుకోవటం సిగ్గుచేటు అని దుమ్మెత్తి పోశారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో నగర అభివృద్ధికోసం కేవలం 10 కోట్లు కేటాయించారన్నారు . రాజకీయ వ్యవస్థ సరిగాలేకపోవటం వల్ల శాంతి భద్రతలు గాడి తప్పుతున్నాయన్నారు. ప్రజా సమస్యలపై నిత్య పోరాటం చేస్తామన్నారు. నిజామాబాద్ నగరపాలక సంస్థపై గులాబీ జెండా ఎగరవేసే వ్యూహాలు సిద్ధం చేసుకున్నామన్నారు. ఇకప్రజా నిర్ణయాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదన్నారు.

Image 1

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

Posted On 2026-08-09 06:28:48

Readmore >
Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >
Image 1

విద్యావంతుడు ఎమ్మెల్యే అయినా నియోజకవర్గంలో విద్య శూన్యం..?

Posted On 2026-08-08 16:04:38

Readmore >
Image 1

రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్

Posted On 2026-08-08 14:28:17

Readmore >
Image 1

రాజమండ్రిలో మెడికోపై తాగుబోతుల రాక్షసత్వం...

Posted On 2026-08-08 07:38:13

Readmore >
Image 1

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!

Posted On 2026-08-08 04:36:39

Readmore >