| Daily భారత్
Logo




గత మున్సిపల్, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో కొన్ని పొరపాట్ల వల్లే ఓడిపోయాం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

News

Posted on 2026-01-25 12:54:30

Share: Share


గత మున్సిపల్, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో కొన్ని పొరపాట్ల వల్లే ఓడిపోయాం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఈసారి ఆ తప్పిదం చేసేది లేదు.. గెలుపు గుర్రాలకే టికెట్లు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి చాలా  ప్రతిష్టాత్మకం

టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మున్సిపల్ జిల్లా ఎన్నికల ఇన్చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్ఠీకరణ

డైలీ బారత్ న్యూస్, నిజామాబాద్: గత మున్సిపల్, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలలో కొన్ని పొరపాట్ల వల్లే ఓడిపోవడం జరిగిందని, ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున ఈ మున్సిపల్ ఎన్నికల్లో కచ్చితంగా గెలిచే అభ్యర్థులకే టికెట్లు అందివ్వనున్నట్లు జిల్లా మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్  లు స్పష్టం చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, జిల్లా నేతలు ఏర్పాటుచేసిన మున్సిపల్ ఎన్నికల సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జ్, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టిపిసిసి చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారితో పాటు ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డిలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రెండు, మూడు రోజుల్లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండని,

రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలను నెక్స్ట్ లెవెల్ లో అభివృద్ధి చేస్తామన్నారు. కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం మనకు గేమ్ చెంజర్ లాంటివి అని అన్నారు. దీనివల్ల 85 శాతం మందికి లబ్ది చేకురనుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో మరో మూడేళ్లు స్థిరమైన ప్రభుత్వం ఉంటుందని రాబోయే ప్రభుత్వం కూడా మనదేఅని అన్నారు.

నిజామాబాద్ లో గత ఎన్నికల్లో మన పనితీరు బాగాలేదని, దయచేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పార్టీ గెలుపులో తమదైన పాత్ర వహించాలని కోరారు. అంతకుముందు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ  ఈసారి జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నిజమాబాద్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం అని ఆయన స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాల కోసమే.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ కు మున్సిపల్ ఎన్నికల ఇంచార్జీ బాధ్యతలు అప్ప చెప్పారని అన్నారు. సర్వేల ఆధారంగా నే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందన్నారు.

హిందూ పేరుతో.. అరవింద్ ఎంపీ అయ్యారని, దేవుళ్ళ పేరుతో ఓట్లు అడిగే సంస్కృతి కాంగ్రెస్ పార్టీది కాదన్నారు. దేవుడు పేరు తో ఓట్లు అడిగే వారు వారు గెలిచాక అభివృద్ధి చేయరని ఆయన అన్నారు. కాంగ్రెస్ బీజేపీ కి ఎంత దూరమో మజ్లిస్ కు అంతే దూరమని స్పష్టం చేశారు.

బీజేపీ నేతలు అబద్ధాన్ని ప్రచారం చేసి, ఇంటింటికి విషం నింపుతున్నారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్స్ కోసం తొందర వద్దని, ప్రలోభాలతో  టికెట్స్ రావని, కార్పొరేటర్, కౌన్సిలర్ సీట్ల కోసం డబ్బులు ఎవరికి ఇవ్వొద్దన్నారు. కులం ,మతం పేరిట ప్రజల జీవితాలు విచ్చిన్నం చేస్తానంటే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు.

Image 1

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

Posted On 2026-08-09 06:28:48

Readmore >
Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >
Image 1

విద్యావంతుడు ఎమ్మెల్యే అయినా నియోజకవర్గంలో విద్య శూన్యం..?

Posted On 2026-08-08 16:04:38

Readmore >
Image 1

రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్

Posted On 2026-08-08 14:28:17

Readmore >
Image 1

రాజమండ్రిలో మెడికోపై తాగుబోతుల రాక్షసత్వం...

Posted On 2026-08-08 07:38:13

Readmore >
Image 1

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!

Posted On 2026-08-08 04:36:39

Readmore >