Posted on 2026-01-22 08:14:24
గుడిని అభివృద్ధి చేస్తా అని మాట ఇచ్చి...గాలికి వదిలేసిన ఎమ్మెల్యే
నాయకుల పొలాలకు తార రోడ్లు... పుణ్య క్షేత్రం కి వెళ్ళడానికి కనీసం కాలినడక దారి కూడా సరిగా లేని దుస్థితి
శివరాత్రి వస్తున్నది గుడిని భక్తులకు అనుకూలంగా అభివృద్ధి చేయాలీ
డైలీ భారత్, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గుర్రాయి గూడెం గ్రామ పరిధిలో ఉన్న దుర్గమ్మ గట్టును సందర్శించిన బిజెపి నాయకులు,బీజేపీ నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి మాట్లాడుతూ వందల ఏళ్ల నాటి చారిత్రక నేపథ్యం,వేల ఏళ్ల ఆధ్యాత్మిక ప్రాశస్త్యం కలిగిన దుర్గమ్మ గట్టుపై వెలసిన స్వయంభూ శివాలయం నేడు పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారింది,ఈ శక్తివంతమైన ఆలయ అభివృద్ధిపై స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గారు తన హామీని విస్మరించడంపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు,ఇచ్చిన హామీలు గాలికి...భక్తులకు కష్టాలే మిగిలే!గత ఏడాది ఉత్సవం సమయంలో ఈ ఆలయాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తాను అని మాట ఇచ్చిన ఎమ్మెల్యే గారు మళ్ళీ శివరాత్రి వస్తున్న అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు,కనీసం భక్తులు గుడికి వెళ్లడానికి సరైన దారి కూడా లేదు,పెద్ద పెద్ద బండరాళ్లు,కంపచెట్ల పేరుకుపోయి ఉన్నవి,దేవుడిని కూడా మోసం చేస్తారా?
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన అసాధ్యమైన హామీల బాటలోనే,ఎమ్మెల్యే గారి హామీలు కూడా కలిసిపోయాయని బీజేపీ నాయకులు ఎద్దేవా చేశారు,నాయకుల పొలాలకు వెళ్లడానికి తార రోడ్లు వేస్తున్నారు,ప్రజలను మోసం చేసినట్లుగా,సాక్షాత్తూ ఆ పరమశివుడిని,దైవ కార్యాన్ని కూడా మోసం చేయడం సరికాదని వారు హెచ్చరించారు,భక్తుల మనోభావాలతో ఆడుకోకుండా,తక్షణమే ఆలయ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు,ఈ కార్యక్రమంలో దమ్మపేట బీజేపీ మండల అధ్యక్షులు పల్లపు వెంకటేశ్వరరావు,నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి,జిల్లా నాయకులు గూడ ముత్యాలరావు,కారం రత్నకుమారి,పల్లపు శిరీష తదితరులు పాల్గొన్నారు.
పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ
Posted On 2026-08-05 17:07:25
Readmore >
ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్
Posted On 2026-08-05 14:58:50
Readmore >
దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?
Posted On 2026-08-05 13:28:01
Readmore >
కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం
Posted On 2026-08-05 13:09:21
Readmore >
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >