| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కుక్కల దాడిలో లేగ దూడ మృతి

కుక్కల దాడిలో లేగ దూడ మృతి

డైలీ భారత్, హుజూర్ నగర్:సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం శ్రీనివాస పురం గ్రామంలో మంగళవారం వీధి కుక్కలు గుంపుగా దాడి చేయడంతో ఒక లేగ దూడ తీవ్ర గాయాలపాలై మృతి చెందింది. 

ఈ ఘటన గ్రామంలో వీధి కుక్కల సంఖ్య నియంత్రణలో లేకపోవడం, పంచాయతీ మరియు పశుసంవర్ధక శాఖల నిర్లక్ష్యానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తుంది. ఇప్పటికే పలుమార్లు వీధి కుక్కల సమస్యపై ఫిర్యాదులు చేసినా సంబంధిత అధికారులు స్పందించకపోవడం వల్లే ఈ నిరపరాధ జీవి ప్రాణాలు కోల్పోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధుల ప్రాణాలకు కూడా తీవ్రమైన ప్రమాదం పొంచి ఉందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

అందువల్ల ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని వీధి కుక్కల నియంత్రణకు సంబంధిత శాఖల నిర్లక్ష్యంపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఈ ఘటనను తేలికగా తీసుకుంటే ప్రజలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

Previous భారీగా పెరిగిన మిర్చి ధరలు.. క్వింటాల్ రూ.44 వేలు
Next రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయండి : ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు
ADVERTISEMENT