| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అర్బన్ నియోజకవర్గం లో ప్రతి డివిజన్ అభివృద్ధి చేయడమే నా లక్ష్యం

అర్బన్ నియోజకవర్గం లో ప్రతి డివిజన్ అభివృద్ధి చేయడమే నా లక్ష్యం

అభివృద్ధి పనులకు భూమి పూజ చేయడానికి వచ్చిన ఎమ్మెల్యేకి అడుగడుగునా నిరాజనం పలికిన ప్రజలు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ప్రధాన లక్ష్యమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్  సూర్యనారాయణ పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని 16, 17, 37, 38, 39, 21, 44, 46 వ డివిజన్లో పరిధిలో నీ పలు ప్రాంతల్లో టి యు ఎఫ్ ఐ డి నిధుల కింద డివిజన్ కు ఒక్కో కోటి రూపాయలు చొప్పున అభివృద్ధి పనులకు  భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులకు భూమి పూజ చేయడానికి వచ్చిన అర్బన్ ఎమ్మెల్యే కి ప్రతి డివిజన్లో అడుగడుగునా ప్రజలు ఘనంగా స్వాగతం పలికి తమ కాలనీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం లో ప్రతి డివిజన్లోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి పార్టీకి అర్బన్ నియోజకవర్గం ప్రజలు మద్దతు పలికి బిజెపి పార్టీని మెజార్టీ స్థానాల్లో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమాలలో పబ్లిక్ హెల్త్ డిఇ ఇంచార్జ్ మున్సిపల్ నగేష్ రెడ్డి మరియు పబ్లిక్ హెల్త్ ఏఇ లు శివకృష్ణ, శంకర్  పాల్గొన్నారు.

Previous భక్తిశ్రద్దలతో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం
Next పాపకొల్లు గ్రామంలో సాంస్కృతిక కార్యక్రమాల్లో శ్రీకృష్ణ రాయబారము పద్య నాటక శిక్షణ కార్యక్రమానికి ప్రారంభోత్సవo
ADVERTISEMENT