| Daily భారత్
Logo




చేపలు, చికెన్, మాంసం దుకాణాలపై విస్తృత తనిఖీలు

News

Posted on 2026-01-19 00:52:19

Share: Share


చేపలు, చికెన్, మాంసం దుకాణాలపై విస్తృత తనిఖీలు

12 కేసులు నమోదు తూనికలు కొలతలు శాఖ అధికారి  మనోహర్

డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో వినియోగదారుల హక్కుల పరిరక్షణలో భాగంగా, ఆదివారం తూనికలు కొలతలు శాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెం సంత ప్రాంతం, కొత్తగూడెం పట్టణం  అన్నపూరెడ్డిపల్లిమండలంలోని చేపలు, చికెన్, మాంసం విక్రయ దుకాణాలపై విస్తృత స్థాయి తనిఖీలు నిర్వహించడమైందని తూనికలు కొలతలు శాఖ అధికారి  కే. మనోహర్ తెలిపారు. తనిఖీలలో తూనికలు కొలతల చట్టం, సంబంధిత నిబంధనలను ఉల్లంఘిస్తూ ధృవీకరణ లేని తూకపు యంత్రాలు వినియోగించడం, సరైన ముద్రలు లేకుండా తూకాలు నిర్వహించడం, కొలతల్లో తేడాలు చూపించడం వంటి అక్రమాలు గుర్తించబడినట్లు తెలిపారు. ఈ ఉల్లంఘనలపై మొత్తం 12 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు.

తూనికలు కొలతల చట్టాన్ని ఉల్లంఘించిన వ్యాపారులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని ఆయన స్పష్టం చేశారు. వినియోగదారులను మోసగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు.అన్ని వ్యాపారులు తప్పనిసరిగా ప్రభుత్వ ధృవీకరణ పొందిన తూకపు యంత్రాలనే వినియోగించాలని, నిర్ణీత కాలవ్యవధిలో పునఃధృవీకరణ చేయించుకోవాలని సూచించారు. వినియోగదారులు కూడా తూకాల్లో అక్రమాలు గమనించినట్లయితే జిల్లా తూనికలు కొలతలు శాఖ కార్యాలయానికి ఫిర్యాదు చేయాల నికోరారు. భవిష్యత్తులో కూడా జిల్లాలోని సంతలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని తూనికలు కొలతలు శాఖ అధికారి  మనోహర్ తెలిపారు.

Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >
Image 1

హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ "సామాజిక న్యాయ తెలంగాణ – సంకల్ప సభ"

Posted On 2026-08-03 14:09:30

Readmore >
Image 1

చిట్టీల పేరుతో ఐదు కోట్ల రూపాయలు ముంచి పరార్

Posted On 2026-08-03 05:58:15

Readmore >
Image 1

60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు

Posted On 2026-08-03 05:55:39

Readmore >
Image 1

ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు

Posted On 2026-08-03 05:54:41

Readmore >