Posted on 2026-01-18 16:44:12
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్‌లో ముఖ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు రవిచందర్ చౌహన్ ,రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలోత్ రాందాస్ నాయక్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్లావత్ రాము నాయక్ , ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్ నాయక్ , కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి బోడో రవి, హాజరయ్యారు.ఈ సందర్భంగా భారతీయ గోర్ బంజారా పోరాట సమితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులుగా భూక్య నరేష్ నూతనంగా నియమించడం జరిగింది. కొత్తగూడెం టౌన్ అధ్యక్షులుగా తేజావత్ వెంకటేష్ , పాల్వంచ పట్టణ అధ్యక్షులుగా ధరావత్ కార్తీక్ నాయక్ టేకులపల్లి మండల అధ్యక్షులుగా గుగులోత్ రమేష్ నాయక్ ,చంద్రుగొండ మండల అధ్యక్షులుగా తేజావత్ సురేష్ నాయక్ నియమించడం జరిగింది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారతీయ గోర్ బంజారా పోరాట సమితి ఆధ్వర్యంలో గిరిజనుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. గిరిజనులకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం సాధించేందుకు సమితి కృషి చేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పలువురు గోర్ బంజారా నాయకులు, కార్యకర్తలు పాల్గొని నూతనంగా నియమితులైన నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు.
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >