Posted on 2026-01-16 14:38:48
భయాందోళనలకు గురవుతున్న ప్రజలు
డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కోతులు అడవులను వదిలి జన సంద్రాలోకి వచ్చి ఇండ్లలోకి గ్రామాల్లోకి ప్రవేశించి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పాటు, ఆర్మూర్, వర్ని మండలాలతో పాటు పలు గ్రామాలలో వానర సైన్యం ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా బయట తిరగాలంటేనే కోతులు ఎక్కడ మీద పడి గాయపరుస్తాయోనని భయంతో జీవిస్తున్నారు. అటు కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలో కోతులు గుంపులుగా చేరి వీరవిహారం చేస్తున్నాయి. విపరీతంగా కొట్లాడుకుంటూ రోడ్లపైకి వస్తుండటంతో వృద్ధులు, చిన్నారులు బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. ఇళ్లపైకి దూకుతూ నిత్యావసరాలను ఎత్తుకెళ్తున్నాయని, బాటసారులపై దాడులకు దిగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. కోతుల బెడదతో నిత్యం భయం గుప్పిట్లో బతుకుతున్నామని, ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి వాటిని బంధించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >