| Daily భారత్
Logo




మెగా రక్తదాన శిబిరం,జాతీయ అవార్డుల కార్యక్రమం

News

Posted on 2026-01-11 16:08:57

Share: Share


మెగా రక్తదాన శిబిరం,జాతీయ అవార్డుల కార్యక్రమం

ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు

డైలీ భారత్, కామారెడ్డి:కామారెడ్డి రక్తదాతల సమూహం 19 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని స్వామి వివేకానంద జయంతి సందర్భంగా లక్ష్మీదేవి గార్డెన్స్ నిజాంసాగర్ రోడ్డు నందు సోమవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరం,మధ్యాహ్నం ఒకటి గంటల నుండి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవిఎఫ్ కామారెడ్డి జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం మరియు జాతీయ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, కామారెడ్డి రక్తదాతల సమూహ ఫౌండర్ డాక్టర్ బాలు,కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు జమీల్ అహ్మద్ తెలియజేయడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసే రక్త దాతలకు ప్రశంసా పత్రాలను కామారెడ్డి జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ న్యాయ సేవాధికారిత సంస్థ కార్యదర్శి నాగరాణి,ఐవిఎఫ్ జాతీయ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా మరియు మరికొంతమంది అతిధులు ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరుగుతుందని, తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు రక్తం దొరకక ఇబ్బందులు పడుతున్నారని వారి ప్రాణాలను కాపాడడానికి కామారెడ్డి జిల్లా యువత ముందుకు రావాలని అన్నారు. 

ఈ కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ గౌరవ అధ్యక్షులు వేద ప్రకాష్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పుట్ల అనిల్ కుమార్ ఉపాధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్ గంప ప్రసాద్ పర్ష వెంకటరమణ లు పాల్గొనడం జరిగింది.

Image 1

సిరిసిల్ల పెద్ద బజార్‌లో వర్ష బీభత్సం : కారుపై కూలిన వేప చెట్టు, ఒకరికి గాయాలు

Posted On 2026-07-30 08:32:38

Readmore >
Image 1

కామన్‌వెల్త్ గేమ్స్‌ : భారత్‌ ఖాతాలో మరో మూడు పతకాలు

Posted On 2026-07-30 06:06:22

Readmore >
Image 1

విశాఖపట్నం : కోటి గాజులతో 89 అడుగుల వినాయకుడి విగ్రహం...

Posted On 2026-07-30 06:05:12

Readmore >
Image 1

జూలూరుపాడు మండలంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడులు...ఏడుగురు అరెస్ట్

Posted On 2026-07-30 05:57:41

Readmore >
Image 1

ఎస్సీ కమిషన్ అధికారాలకు సుప్రీంకోర్టు పరిమితి

Posted On 2026-07-30 05:25:04

Readmore >
Image 1

హార్వెస్టర్ల ముసుగులో స్నాచింగ్... పంజాబ్ ముఠా అరెస్ట్

Posted On 2026-07-29 18:33:08

Readmore >
Image 1

రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవు

Posted On 2026-07-29 16:23:43

Readmore >
Image 1

సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-29 16:22:04

Readmore >
Image 1

వర్షాల వేళ అప్రమత్తంగా కామారెడ్డి పోలీసులు – ప్రజల భద్రతకు ముందస్తు చర్యలు

Posted On 2026-07-29 16:19:52

Readmore >
Image 1

తెరవే ఆధ్వర్యం లో ఘనంగా సి నా రె జయంతి...

Posted On 2026-07-29 16:18:19

Readmore >