| Daily భారత్
Logo




మాలల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన లక్ష్యం..

News

Posted on 2026-01-11 17:00:36

Share: Share


మాలల అభ్యున్నతే కాంగ్రెస్  ప్రభుత్వం ప్రధాన లక్ష్యం..

డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్:  మాలల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, జాతి సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని వారి క్షేమమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ షబ్బీర్ అలీ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్‌లో జిల్లా మాల మహానాడు ఆధ్వర్యంలో నూతనంగా గెలిచిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, మంత్రి జి. వివేక్ వెంకటస్వామి  ముఖ్య అతిథులుగా పాల్గొని  శాలువలతో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా మహమ్మద్ అలీ షబ్బీర్  మాట్లాడుతూ 

కాంగ్రెస్ పార్టీ గెలుపు లో మాల సామాజిక వర్గం యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉందని వివరించారు. ​స్థానిక సంస్థల్లో ఎన్నికైన ప్రజా ప్రతినిధులు గ్రామ అభివృద్ధికి వెన్నెముక గా నిలబడి ముందుండి నడపాలని అన్నారు. 

ముఖ్యంగా మాల సామాజిక వర్గం నుండి ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అట్టడుగు వర్గాల గొంతుక కావాలని సూచించారు. ​మా ప్రభుత్వం ఎప్పుడూ దళిత మరియు వెనుకబడిన వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని అన్నారు. నిజామాబాద్ జిల్లా అభివృద్ధిలో మీ అందరి భాగస్వామ్యం అవసరం. మీకు ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుంది. ​మాల మహానాడు వంటి సంస్థలు సమాజాన్ని ఏకం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. పదవులు రావడం ముఖ్యం కాదు, ఆ పదవుల ద్వారా ప్రజలకు ఎంత సేవ చేశామన్నదే ముఖ్యం అన్నారు. 

రాష్ట్ర ​మంత్రి జి. వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ 

మాలల హక్కులు, భవిష్యత్తు కార్యాచరణపై ప్రత్యేక దృష్టి పెడతానని అన్నారు. ​మనం ఈరోజు ఇక్కడ సన్మానం పొందుతున్నామంటే అది బాబాసాహెబ్ పెట్టిన భిక్ష అని అన్నారు.  రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల వల్లే మనకు ఈ రాజకీయ అధికారం దక్కిందని , ఈ అధికారాన్ని కేవలం మన కుటుంబాల కోసమే కాకుండా, సమాజం కోసం వాడాలని అభిప్రాయ పడ్డారు. ​గ్రామాల్లో మాల పల్లెల అభివృద్ధికి మౌలిక వసతుల కల్పనకోసం ప్రత్యేక నిధులు కేటాయించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

డ్రైనేజీ, సిసి రోడ్లు మరియు తాగునీటి సౌకర్యాల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా పనిచేయాలని సూచించారు. చదువు ఒక్కటే మన జీవితాలను మారుస్తుంది. మీ గ్రామాల్లోని దళిత బిడ్డలు ఉన్నత చదువులు చదివేలా మీరు ప్రోత్సహించాలని అన్నారు. 

ప్రభుత్వం అందిస్తున్న విదేశీ విద్యా నిధి వంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండని అన్నారు . మా తండ్రి కాకా వెంకటస్వామి ఆశయాలు ఎంతో ఉన్నతమైన వని, (కాకా) ఎప్పుడూ దళితుల ఐక్యత కోసం తపించారని, అదే బాటలో తాను కూడా మీ సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, గడుగు గంగాధర్, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చిన్నయ్య, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దేవిదాస్, లింబాద్రి , టీఎన్జీవో నాయకులు కిషన్ , గెలుపొందిన మాల సర్పంచులు ఉప సర్పంచ్లు మహానాడు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Image 1

మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తంబళ్ల రవి

Posted On 2026-04-19 14:12:55

Readmore >
Image 1

ఎంఎంటీఎస్‌లో అందరికీ ఉచిత ప్రయాణం?

Posted On 2026-04-19 10:18:18

Readmore >
Image 1

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శస్త్ర చికిత్సా

Posted On 2026-04-18 22:48:35

Readmore >
Image 1

లవ్ జీహాద్ ని భారత దేశం నుండి తరిమి కొట్టాలి

Posted On 2026-04-18 22:34:02

Readmore >
Image 1

2029పై బీజేపీ దృష్టి..?

Posted On 2026-04-18 17:30:19

Readmore >
Image 1

రోడ్ సేఫ్టీ పోటీల విజేతలకు జిల్లా కలెక్టర్ ప్రశంసలు

Posted On 2026-04-18 17:23:21

Readmore >
Image 1

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ

Posted On 2026-04-18 17:19:19

Readmore >
Image 1

సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్

Posted On 2026-04-18 17:08:15

Readmore >
Image 1

రాజకీయ వివాదాలను కుల సంఘాలకు ముడిపెట్టొద్దు

Posted On 2026-04-18 17:07:03

Readmore >
Image 1

మృత్యువు అంచున ఉన్నవారి ప్రాణాలను కాపాడిన "ఖాకీ హీరోలు"

Posted On 2026-04-18 17:04:25

Readmore >