| Daily భారత్
Logo




పేద ప్రజల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం

News

Posted on 2026-01-08 15:13:17

Share: Share


పేద ప్రజల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నగరంలోని కంఠేశ్వర్ బైపాస్ ప్రాంతంలోని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి నాలుగు మండలాలకు చెందిన 214 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తి అయిన నేపథ్యంలో పేదలకు తోడుగా వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం అప్పులు చేసి తెలంగాణను దివాళా తీసిందని విమర్శించారు.

వృద్ధులకు త్వరలోనే పెన్షన్ ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారని గుర్తు చేశారు. బస్సు ప్రయాణం, వడ్డీలేని రుణాలు, రైతు భీమా, రైతు భరోసా, రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత కరెంట్ వంటి పథకాల ద్వారా పేదలు ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. మహిళల ఆర్థిక శక్తివంతతకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వ లక్ష్యం కోటి మంది మహిళలను కోటీశ్వర్లుగా తీర్చిదిద్దడమేనన్నారు.

ఇందిరామహిళా శక్తి కింద డ్వాక్రా గ్రూపులు సిండికేట్‌గా ఏర్పడి బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకిస్తే నెలకు రూ.70,000 ఆదాయం వచ్చే అవకాశమున్నట్లు వివరించారు. రైతును రాజును చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని, రైతులకు ఉచిత కరెంట్, రైతుభరోసా, రుణమాఫీ వంటి పథకాలు కొనసాగుతున్నాయన్నారు.

హైదరాబాద్‌ను గ్లోబల్ సిటిగా అభివృద్ధి చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు లేకపోవడం ప్రజలు గమనించాలని సూచించారు. ఎన్నికల సమయంలో రాముడి పేరు తెరపైకి తెచ్చి ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు.

బీఆర్ఎస్‌లో ఆస్తుల పంచాయతీ నడుస్తోందని, కుటుంబ విభేదాలు బయటపడటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. 

కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం సిబ్బంది పాల్గొన్నారు.

Image 1

అంగమలి - శబరిమల రైలు మార్గం భూసేకరణ ప్రారంభించిన కేరళ ప్రభుత్వం

Posted On 2026-07-27 18:35:56

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చూపిన జూలూరుపాడు ఆరోగ్య జీవన యాత్ర మండల వాసులు

Posted On 2026-07-27 17:05:43

Readmore >
Image 1

డైరీ విద్యార్థులకు నాణ్యమైన నూతన విద్యా విధానం అమలు చేయాలి వైస్ ఛాన్స్ లర్..డాక్టర్ జ్ఞాన ప్రకాష్

Posted On 2026-07-27 15:43:01

Readmore >
Image 1

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను తొలగించండి...

Posted On 2026-07-27 15:39:03

Readmore >
Image 1

RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం

Posted On 2026-07-27 14:31:47

Readmore >
Image 1

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-07-27 14:26:00

Readmore >
Image 1

రేగళ్ల PHC ఆకస్మిక తనిఖీ... సకాలంలో నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశం

Posted On 2026-07-27 14:24:02

Readmore >
Image 1

సీతారామ ప్రాజెక్టు రూపురేఖలు మార్చకుండా రైతులకు సాగునీరు అందించాలి

Posted On 2026-07-27 14:06:55

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇండ్ల పేరుతో వసూళ్లు... కేటీఆర్ మౌనంపై బీజేవైఎం ఆగ్రహం

Posted On 2026-07-27 08:16:22

Readmore >
Image 1

అధిరణ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరై ఆశీర్వదించిన వెంకట సాయి నగర్ కాలనీ ప్రతినిధులు

Posted On 2026-07-27 07:39:23

Readmore >