| Daily భారత్
Logo




జిల్లా కేంద్రంలో గంజాయి ముఠాపై ఎక్సైజ్ అధికారుల దాడులు

News

Posted on 2026-01-08 13:56:52

Share: Share


జిల్లా కేంద్రంలో గంజాయి ముఠాపై  ఎక్సైజ్ అధికారుల దాడులు

ఆక్రమంగా గంజాయి తరలిస్తున్న ఐదుగురు అరెస్ట్

ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:మధ్యప్రదేశ్ రాష్ట్రం  నుండి తెలంగాణకు అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముఠా సభ్యుల ను నిజామాబాద్ ఎక్సైజ్ బృందం పట్టుకున్నారు. ఆ ప్రాంతంలో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి నిజామాబాద్ జిల్లాలో అధిక ధర కు విక్రయించేందుకు రవాణా చేస్తున్న ఇద్దరు మహిళలతో కూడిన ఐదుగురు సభ్యుల  గంజాయి విక్రయించే ముఠాను గురువారం అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ సూపర్డెంట్ మల్లారెడ్డి తెలిపారు. జిల్లా ఎక్సైజ్ సూపర్డెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అదిలాబాద్ జిల్లాకు చెందిన పూజా పవర్, దుర్బాధ భాయ్ జాదవ్ ఇద్దరు మహిళలు కలిసి మధ్యప్రదేశ్ లోని సిర్పూర్ ప్రాంతం నుండి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి, మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతానికి చెందిన కిషన్ మోతిరామ్ దాతే, యావత్ మల్ ఇంద్రజిత్ టాగ్రే లు కలిసి కామారెడ్డి జిల్లా గాంధారి మండలం చెద్మల్ ప్రాంతానికి చెందిన దుంజా వెంకట్రాం అనే వ్యక్తికి విక్రయించేందుకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్డు ప్రాంతానికి వచ్చారు. దీంతో నిజామాబాద్ ఎక్సైజ్ ఎస్ హెచ్ ఓ  స్వప్న ఆధ్వర్యంలో ఎక్సైజ్ బృందం ఐదుగురు సభ్యులు గల గంజాయి ముఠాలు పట్టుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుండి 13 కేజీల ఎండు గంజాయి ఐదు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు 

మల్లారెడ్డి వెల్లడించారు. ఈ ముఠాలు పట్టుకునేందుకు సీఐ స్వప్న తో పాటు ఎస్సైలు మల్లేష్, సుస్మిత, సిబ్బంది సునీల్, ప్రభాకర్, రవి, సంగయ్య, సౌమ్య, సుచరిత, సంజయ్ లు కృషి చేసిన సిబ్బందిని అభినందించారు.

Image 1

అంగమలి - శబరిమల రైలు మార్గం భూసేకరణ ప్రారంభించిన కేరళ ప్రభుత్వం

Posted On 2026-07-27 18:35:56

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చూపిన జూలూరుపాడు ఆరోగ్య జీవన యాత్ర మండల వాసులు

Posted On 2026-07-27 17:05:43

Readmore >
Image 1

డైరీ విద్యార్థులకు నాణ్యమైన నూతన విద్యా విధానం అమలు చేయాలి వైస్ ఛాన్స్ లర్..డాక్టర్ జ్ఞాన ప్రకాష్

Posted On 2026-07-27 15:43:01

Readmore >
Image 1

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను తొలగించండి...

Posted On 2026-07-27 15:39:03

Readmore >
Image 1

RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం

Posted On 2026-07-27 14:31:47

Readmore >
Image 1

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-07-27 14:26:00

Readmore >
Image 1

రేగళ్ల PHC ఆకస్మిక తనిఖీ... సకాలంలో నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశం

Posted On 2026-07-27 14:24:02

Readmore >
Image 1

సీతారామ ప్రాజెక్టు రూపురేఖలు మార్చకుండా రైతులకు సాగునీరు అందించాలి

Posted On 2026-07-27 14:06:55

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇండ్ల పేరుతో వసూళ్లు... కేటీఆర్ మౌనంపై బీజేవైఎం ఆగ్రహం

Posted On 2026-07-27 08:16:22

Readmore >
Image 1

అధిరణ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరై ఆశీర్వదించిన వెంకట సాయి నగర్ కాలనీ ప్రతినిధులు

Posted On 2026-07-27 07:39:23

Readmore >