| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026 ప్రజల ఆనందాల సంవత్సరం కావాలని, ప్రతి ఇంటా నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని, సంపద, సమృద్ధి కలుగాలని ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సంవత్సరకాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి నూతన సంవత్సరంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే విధంగా కృషి చేస్తానని, నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలు ఆశీస్సులు దీవెనలు అందిస్తారని ఆశిస్తూ పట్నం మహేందర్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు  తెలిపారు.ముఖ్యంగా ప్రభుత్వ పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని తద్వారా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.

Previous నిజామాబాద్​ కలెక్టర్​గా బాధ్యతలు స్వీకరించిన ఇలా త్రిపాఠి
Next నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జిల్లా గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి
ADVERTISEMENT