| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అమృతం

అమృతం

డైలీ భారత్ స్పెషల్: అమృతం 

ప్రియతమ నాయకుడి

విగ్రహాలకు పాలాభిషేకాలంట

దొంగ స్వాముల పాదములకు

పాలాభిషేకాలంట

పాల్లేక ఆకలితో అలమటించే

శిశువుల రోదనలు మరిచిపోయినారా

ఆకలితో అలమటిస్తు కాటికి కాలు చాపిన

వృద్ధ రోగులను మరిచిపోయినారా

ఆయువు నిలబట్టాల్సిన క్షీరం

ఆవిరై పోతుంటె గోమాత

పడిన బాధ మరిచిపోయినారా

లేగదూడల కడుపు కొట్టి

పితికిన పాలను హీరో పోస్టర్లకి

అభిషేకాలు చేస్తూ

దూడల అరుపులు మరిచిపోయినారా

ఎంతోమంది ప్రాణాలు కాపాడే

అమృతాన్ని వృధా కాకుండా

చూడాలని కోరుకుంటూ

మీ

మంజుల పత్తిపాటి

మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా

తెలంగాణా రాష్ట్రం

 చరవాణి 9347042218

Previous ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకుంటే ఒక లక్ష మాత్రమే ప్రోత్సాహకం
Next జనవరి నుంచే అంగన్వాడీల్లో బ్రేక్ ఫాస్ట్
ADVERTISEMENT