డైలీ భారత్, హుజూర్ నగర్:హుజూర్ నగర్ నియోజకవర్గం చింతలపాలెం మండల కేంద్రంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాణావత్ గాంధీ అనే వ్యక్తి దుర్మారణం చెందాడు. టిప్పర్ ఢీ కొనడంతో బైకర్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.వేగంగా వస్తున్న టిప్పర్ లారీ బైక్‌ను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడి కుటుంబానికి తగిన న్యాయం చేయాలని బంధువులు ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
News
టిప్పర్ లారీ ఢీకొని బైకర్ దుర్మారణం