Posted on 2025-12-17 14:37:24
డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా: తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై కీలక తీర్పు వెలువరింది. అయిదుగురు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు ఆరోపణలను స్పీకర్ గడ్డం ప్రసాద్ తోసిపుచ్చారు. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీపై అనర్హత వేటు వేయడానికి స్పీకర్ నిరాకరించారు. వీరు పార్టీ ఫిరాయించినట్లు ఎక్కడా ఆధారాలు లేవని స్పీకర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. దీంతో అనర్హత వేటు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ఐదుగురు ఎమ్మెల్యేలకు భారీ ఊరట లభించినట్లైంది.కాగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ భారత రాష్ట్ర సమితి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ అంశంపై పలుమార్లు విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ తన నిర్ణయాన్ని నేడు ప్రకటించారు. కాగా రేపు మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసులో స్పీకర్ తీర్పును ప్రకటించనున్నారు. అనర్హత పిటిషన్ల కేసులో ఎల్లుండితో సుప్రీంకోర్టు విధించిన గడువు ముగియనుంది.
ఎమ్మార్పీఎస్ కామారెడ్డి నియోజకవర్గ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసిన జిల్లా ఇన్చార్జ్
Posted On 2026-07-29 08:54:06
Readmore >
చింతపూడి యుగంధర్ పార్దివదేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎడవల్లి కృష్ణ
Posted On 2026-07-29 08:52:51
Readmore >
మహిళా లెక్చరర్ పేరుతో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి
Posted On 2026-07-29 08:51:28
Readmore >
విశ్వహిందూ పరిషత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి గా కొమ్ము నరేష్
Posted On 2026-07-29 04:49:54
Readmore >
రక్షించాల్సిన ఖాకీనే కీచకుడిగా మారాడు... జూబ్లీహిల్స్ CI సస్పెండ్
Posted On 2026-07-29 04:48:42
Readmore >
కామారెడ్డి : కళ్యాణలక్ష్మి పథకంలో భారీ మోసం బట్టబయలు... ముగ్గురి అరెస్ట్
Posted On 2026-07-28 17:42:20
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 71 మందికి కోర్టు శిక్షలు – ₹81,500 జరిమానా విధింపు
Posted On 2026-07-28 17:30:20
Readmore >
మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఇబ్రహీం
Posted On 2026-07-28 17:21:37
Readmore >