డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా : ఫరూఖ్‌నగర్ మండలం భీమారం గ్రామానికి సర్పంచ్‌గా ఎల్కుర్తి గీతా వీరేశం గుప్తా గురువారం విజయం సాధించారు. భీమారం గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎల్కుర్తి గీతా వీరేశం గుప్తా 201 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ మద్దతు ఉన్న అభ్యర్థి పూజారి మాధవిపై ఆమె సాధించిన ఘన విజయం పట్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా, గీతా వీరేశం గుప్తా ప్యానెల్ ఎనిమిది వార్డులకు గాను ఏడు వార్డులను కైవసం చేసుకుంది. తన విజయం సందర్భంగా ఆమె గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
News
భీమారం సర్పంచ్‌గా ఎల్కుర్తి గీతా వీరేశం గుప్తా విజయం