| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మరో గంటలో ముగియనున్న గ్రామపంచాయతీ మొదటి విడత పోలింగ్

మరో గంటలో ముగియనున్న గ్రామపంచాయతీ మొదటి విడత పోలింగ్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా లో బోధన్ డివిజన్ పరిధిలో గురువారం కొనసాగుతున్న మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ సరళి మరో గంటలో ముగియనుంది. అయితే పోలీసులు, ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. దీంతో ఇప్పటివరకు ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ సరళి ప్రశాంతంగా కొనసాగుతుంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు మాత్రమే పోలింగ్ ప్రక్రియ ఉన్న నేపథ్యంలో పోలింగ్ ప్రక్రియను ఎన్నికల అధికారులు ఒంటిగంట వరకు నిర్వహించనున్నారు. ఆ తర్వాత పోలింగ్ ప్రక్రియను నిలిపివేయనున్నారు. ఒంటిగంట నుండి రెండు గంటల వరకు ఎన్నికల అధికారులకు భోజన విరామం తర్వాత రెండు గంటల నుండి సాయంత్రం 5 వరకు ఎన్నికల కోట్ల లెక్కింపు కార్యక్రమం చేపట్టనున్నారు. ఇదే రోజు గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థిని కూడా ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు

Previous ప్రశాంత వాతావరణంలో జరుగుతున్న మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు : జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
Next ప్రశాంతంగా ముగిసిన మొదటి దశ గ్రామపంచాయతీ ఎన్నికలు
ADVERTISEMENT