| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బీచ్ రోడ్ లో అగ్ని ప్రమాదం జరిగిన భవనాన్ని వద్ద రక్షణ చర్యలను పర్యవేక్షించిన విశాఖ నగర సిపి

బీచ్ రోడ్ లో అగ్ని ప్రమాదం జరిగిన భవనాన్ని వద్ద రక్షణ చర్యలను పర్యవేక్షించిన విశాఖ నగర సిపి

డైలీ భారత్ న్యూస్, విశాఖపట్నం:ఈ రోజు ఉదయం 7:15 గంటలకు మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బీచ్ రోడ్‌లోని ఒక బహుళ అంతస్థుల భవనంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే డా. శంఖబ్రత బాగ్చి ఐ.పీ.ఎస్., కమిషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మెజిస్ట్రేట్ సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. సకాలంలో చర్యలు తీసుకోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ సందర్భంగా సీపీ బహుళ అంతస్థుల భవనాల్లో ఫైర్ సేఫ్టీ, ఎలక్ట్రిక్ సేఫ్టీ ఆడిట్‌లు నిర్వహించాలని, కాలం ముగిసిన ఫైర్ ఎక్స్టింగ్విషర్లను వెంటనే మార్చి, నివాసితులకు వాటి వినియోగంపై అవగాహన కల్పించాలని తెలిపారు. 

#DGPAndhraPradesh #AndhraPradeshStatePolice #VizagCityPolice

Previous హత్య కేసులో 08 మంది నింధుతుల అరెస్ట్
Next ప్రచారంలో దూసుకుపోతున్న వజ్జా ఈశ్వరి
ADVERTISEMENT