Posted on 2025-12-10 12:55:12
డిసిసి అధ్యక్షుడు పదవి దక్కిన తర్వాత అగ్నిపరీక్షగా మారిన పంచాయతీ ఎన్నికలు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఇటీవల నిజామాబాద్ డిసిసి అధ్యక్షుడిగా నియామకమైన కాటిపల్లి నగేష్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గట్టెక్కిస్తారా విషయం తెరపైకి వచ్చింది. కీలకమైన గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో ఆయన ముందుండి పార్టీలోని ప్రతి కార్యకర్తలను, అనే చర్చ జోరుగా సాగుతుంది. ఇప్పటికే మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు గురువారం జరగనున్న నేపథ్యంలో ఈ మొదటి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధిస్తారా లేదా అనేది వారిలో టెన్షన్ వారిలో టెన్షన్ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున ముందుంది నిలబడి ప్రచారం చేసిన సందర్భాలు లేవు. కేవలం బోధన్ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి పై నమ్మకంతోనే బోధన్ డివిజన్లోని ఆయా గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గట్టిగా వారి ప్రయత్నంలో వారు ఉన్నారు. అయితే రెండవ విడత మూడవ విడత ఎన్నికల ప్రచారంలో నైనా కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడే సర్పంచ్ అభ్యర్థుల తరఫున జిల్లా అధ్యక్షుడు వారికి అండగా ఉంటూ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తారా లేదా అనే సందేహం పార్టీ వర్గాల్లోనే నెలకొంది. గతంలో మాజీ డిసిసి అధ్యక్షుడు గా పనిచేసిన మానాల మోహన్ రెడ్డి గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సమయంలో పార్టీలో కిందిస్థాయి క్యాడర్ నుండి సీనియర్ నాయకుల వరకు అందర్నీ కలుపుకొని జిల్లాలో కాంగ్రెస్ కంటూ ఓ బలం తీసుకువచ్చారు. ఆయన త్రోవలోనే తాజా డీసీసీ అధ్యక్షులు నాగేష్ రెడ్డి నరుస్తారా లేక ఎవరిని పట్టించుకోకుండా తన సొంత దారిలోనే నడుస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. గ్రామపంచాయతీ ఎన్నికలు తర్వాత జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఒకదాని వెనక ఒకటి రావడంతో నగేష్ రెడ్డి ఇప్పటికైనా కింది స్థాయి కార్యకర్తలను అందరినీ కలుపుకొని వారికి ఏ కష్టం వచ్చినా ముందుండి పోతేనే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్షాలకు డీటుగా ఉంటూ వారు ఏరియా సమావేశంలో వారు ఏరియా సమావేశంలో ప్రభుత్వంపై ఎలాంటి వ్యాఖ్యలు చేసిన నూతన డిసిసి అధ్యక్షుడు అంతకు రెట్టింపు స్థాయిలో కౌంటర్ ఇస్తేనే జిల్లాలో వచ్చే ఎన్నికల్లో పార్టీ మనుగడ సాధించవచ్చు అని కాంగ్రెస్ పార్టీలోనే కొందరు సీనియర్ నేతలు విశ్లేషిస్తున్నారు. చూద్దాం ఏది ఏమైనప్పటికీ రానున్న వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని నగేష్ రెడ్డి ఏ విధంగా మార్చనున్నారో చూడాల్సిందే.. మరోవైపు పార్టీలోనే కొందరు సీనియర్ నేతలు నగేష్ రెడ్డి పట్ల విముఖత చూపుతున్నట్లు స్పష్టంగా కనబడుతుంది ఒకప్పుడు గతంలో మాజీ డిసిసి అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి ఏ మీడియా సమావేశం నిర్వహించిన కింది స్థాయి నుంచి సీనియర్ నేతల వరకు అందరూ మీడియా సమావేశంలో పాల్గొని ఆయనకు మద్దతుగా నిలిచేవారు. ఇప్పుడు కూడా నగేష్ రెడ్డి అదే మార్గాన నడిచి సీనియర్ జూనియర్ అనే తేడా చూపకుండా అందర్నీ కలుపుకొని పోతేనే వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు చులబత్తరం కావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక నగేష్ రెడ్డికి రూరల్ నియోజకవర్గం నుండి తప్ప ఇతర నియోజకవర్గాల నుండి కాంగ్రెస్ నేతలు అంతగా పరిచయాలు లేవని పార్టీలోనే కొందరు గుసగుసలాడుతున్నారు.
నలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరి, నలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులు
Posted On 2026-07-30 17:36:26
Readmore >
సుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు
Posted On 2026-07-30 17:09:03
Readmore >
సిరిసిల్ల : వర్షపు నీటితో అల్లాడుతున్న శ్రీనగర్ కాలనీవాసులు
Posted On 2026-07-30 16:35:13
Readmore >
హిందీ భాషాభివృద్ధి కి కృషి... హిందీ ఫోరం అధ్యక్షులు ఇంద్రశేఖర్
Posted On 2026-07-30 16:19:48
Readmore >
ఆధునిక యుగంలో సామాజిక మార్పునకు సోషల్ మీడియా శక్తివంతమైన ఆయుధం : పద్మశ్రీ మందకృష్ణ మాదిగ
Posted On 2026-07-30 16:14:52
Readmore >
సోనుసూద్ జన్మదిన వేడుకల్లో బిజెపి చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్
Posted On 2026-07-30 13:36:16
Readmore >