Posted on 2025-12-10 12:47:33
డైలీ భారత్ న్యూస్, నర్సంపేట:ప్రభుత్వ వైద్య కళాశాల నర్సంపేట ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్ ఆధ్వర్యంలో 2025 - 2026 మొదటి సంవత్సరం వైద్య విద్యార్థులు మహేశ్వరం గ్రామాన్ని "కుటుంబ దత్తత కార్యక్రమం ను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ మోహన్ దాస్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ వైద్య విద్యార్థులకు ఇదొక మంచి సువర్ణ అవకాశం గా వివరించడం జరిగింది ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితి వారి యొక్క పరిసరాలు ఇతర వివరాలను సేకరించి రాబోయే నాలుగున్నర సంవత్సరాలలో వారి యొక్క ఆరోగ్య స్థాయిని మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలని వివరించడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థి ఐదు కుటుంబాలను దత్తత తీసుకొని వారి వ్యక్తిగత వివరాలు వారి ఆరోగ్య పరిస్థితి ఏ స్థాయిలో ఉన్నది తెలుసుకొని రాబోయే రోజుల్లో వారి యొక్క పరిసరాలు, ఆరోగ్య పరిస్థితి మెరుగుపరుచుకునేలా చేయడమే ఈ "కుటుంబ దత్తత కార్యక్రమం" యొక్క ముఖ్య ఉద్దేశం అని వివరించడం జరిగింది.
ఈ సమావేశాన్ని ఉద్దేశించి డాక్టర్ సుజాత అసోసియేట్ ప్రొఫెసర్ మాట్లాడుతూ వైద్య విద్యార్థులు ఈ నాలుగున్నర సంవత్సరాలు వారితో ఒక కుటుంబ సభ్యులుగా మారి వారి యొక్క జీవన విధానాలు ఆరోగ్య ని మెరుగుపరుచుకునేలా సహకరించాల్సిందిగా కోరారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్. సుచరిత, మహేందర్ రెడ్డి, విజయకుమార్, పద్మజ, అశోక్,పంచాయతీ సెక్రెటరీ,శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
నలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరి, నలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులు
Posted On 2026-07-30 17:36:26
Readmore >
సుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు
Posted On 2026-07-30 17:09:03
Readmore >
సిరిసిల్ల : వర్షపు నీటితో అల్లాడుతున్న శ్రీనగర్ కాలనీవాసులు
Posted On 2026-07-30 16:35:13
Readmore >
హిందీ భాషాభివృద్ధి కి కృషి... హిందీ ఫోరం అధ్యక్షులు ఇంద్రశేఖర్
Posted On 2026-07-30 16:19:48
Readmore >
ఆధునిక యుగంలో సామాజిక మార్పునకు సోషల్ మీడియా శక్తివంతమైన ఆయుధం : పద్మశ్రీ మందకృష్ణ మాదిగ
Posted On 2026-07-30 16:14:52
Readmore >
సోనుసూద్ జన్మదిన వేడుకల్లో బిజెపి చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్
Posted On 2026-07-30 13:36:16
Readmore >