| Daily భారత్
Logo




గ్రామపంచాయతీ ఎన్నికలు మొదటి విడత నిర్వహణలో భాగంగా బోధన్ డివిజన్ పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సిపి

News

Posted on 2025-12-09 14:22:36

Share: Share


గ్రామపంచాయతీ ఎన్నికలు మొదటి విడత నిర్వహణలో భాగంగా బోధన్ డివిజన్ పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సిపి

ప్రజలు శాంతియుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మొదటి విడత ఎన్నికలు బోధన్ డివిజన్ పరిదిలో జరగనున్న నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లను మంగళవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య బోధన్ సర్కిల్ కార్యాలయంలో సంబంధిత పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని తూ.చా తప్పకుండా పాటించాలని తెలియజేశారు. ప్రధానంగా

బోధన్ డివిజన్ పరిధిలో గల సమస్యత్మకమైన, అతిసమస్యత్మకమైనటువంటి పోలింగ్ స్టేషన్లను  గుర్తించి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రతీ పోలింగ్ కేంద్రానికి నిర్దిష్ట దూరంలో మార్కింగ్ చేయించి , ప్రచారం , గుర్తులను ప్రదర్శించడం నివారించాలని అన్నారు. అవసరాన్ని బట్టి స్ట్రైకింగ్ ఫోర్స్ సేవలను వినియోగించుకొని గుంపులను చెదర గొట్టాలని అన్నారు. ఎన్నికలను ప్రభావితం చేసే డబ్బు, మద్యం, మరే ఇతరములు అక్రమ రవాణా జరగడానికి విలులేకుండా అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ లను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. విలేజ్ పోలీసు అధికారులు (విపిఓ)ఆయా గ్రామలపై నిఘా ఉంచి, ముందస్తు సమాచారాన్ని సేకరించి, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు కృషి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఎన్నికల రోజు సిబ్బంది తెల్లవారుజామునే తమకు కేటాయించిన పోలింగ్ బూతు వద్ద సక్రమమైన విధులు నిర్వహించాలని , ఎన్నికల తర్వాత ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొత్తము పూర్తి అయ్యేవరకు ఎవరు ఎలాంటి ప్రలోభాలకు గురి కావద్దని, ఎన్నికల నియమావళిని తూ.చా తప్పకుండా పాటించే విధంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని విధినిర్వహణలో ఎలాంటి లోపాలు ఉన్న అట్టి సిబ్బందిపై తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది.ఈ సందర్భంగా బోధన్ ఏ.సి.పి శ్రీనివాస్,  బోధన్ రూరల్ సీ.ఐ  విజయబాబు,  బోధన్ ఎస్హెచ్ఓ  వెంకట్ నారాయణ, నిజామాబాద్ నార్త్  సర్కిల్ ఇన్స్పెక్టర్ బి . శ్రీనివాస్, రుద్రూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్  కృష్ణ, బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి , ఎడపల్లి ఎస్సై రమ,  రెంజల్ ఎస్సై చంద్రమోహన్,  కోటగిరి ఎస్సై సునిల్, వర్ని ఎస్సై ఎస్.రాజు, రుద్రూర్ ఎస్సై సాయన్న తదితరులు పాల్గొన్నారు.

Image 1

ఎమ్మార్పీఎస్ కామారెడ్డి నియోజకవర్గ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసిన జిల్లా ఇన్చార్జ్

Posted On 2026-07-29 08:54:06

Readmore >
Image 1

చింతపూడి యుగంధర్ పార్దివదేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎడవల్లి కృష్ణ

Posted On 2026-07-29 08:52:51

Readmore >
Image 1

మహిళా లెక్చరర్ పేరుతో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి

Posted On 2026-07-29 08:51:28

Readmore >
Image 1

స్నేహ సుగంధం---మంజుల పత్తిపాటి

Posted On 2026-07-29 05:09:34

Readmore >
Image 1

విశ్వహిందూ పరిషత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి గా కొమ్ము నరేష్

Posted On 2026-07-29 04:49:54

Readmore >
Image 1

రక్షించాల్సిన ఖాకీనే కీచకుడిగా మారాడు... జూబ్లీహిల్స్ CI సస్పెండ్

Posted On 2026-07-29 04:48:42

Readmore >
Image 1

కామారెడ్డి : కళ్యాణలక్ష్మి పథకంలో భారీ మోసం బట్టబయలు... ముగ్గురి అరెస్ట్

Posted On 2026-07-28 17:42:20

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 71 మందికి కోర్టు శిక్షలు – ₹81,500 జరిమానా విధింపు

Posted On 2026-07-28 17:30:20

Readmore >
Image 1

మూడోసారీ ఆడపిల్లేనని అబార్షన్ ఆ తరవాత మహిళ మృతి

Posted On 2026-07-28 17:22:38

Readmore >
Image 1

మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఇబ్రహీం

Posted On 2026-07-28 17:21:37

Readmore >