మన గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందాం!
బీజేపీ జిల్లా కార్యదర్శి శివనాత్రి వేణు
బిజెపి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బొల్లం అరుణ ను గెలిపించుకుందాం
బీజేపీ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి శివనాత్రి వేణు
డైలీ భారత్ న్యూస్, భూపాలపల్లి: ఈరోజు సర్పంచి ఎన్నికలలో భాగంగా గణపురం సర్పంచ్ బిజెపి పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని ఈరోజు గణపురంలో గడపగడపకు ప్రచారం నిర్వహించడం జరిగింది.
అనంతరం వారు మాట్లాడుతూ..
గ్రామాల అభివృద్ధి కేంద్ర నిధులతోనే సాధ్యమని, అందుకే బిజెపి సర్పంచ్, వార్డ్ మెంబర్ అభ్యర్థులను గెలిపించాలని సూచించారు. గణపురం ఒక చారిత్రాత్మక నేపథ్యం కలిగిన కాకతీయుల కాలం నాటి గ్రామమని గ్రామం పై గ్రామ సమస్యలపై పూర్తిగా అవగాహన ఉన్న ఒక సాధారణ మహిళ బొల్లం అరుణ అని అన్నారు. రైతుల కోసం పోరాటం చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందిన వ్యక్తి అరుణ అని గుర్తు చేశారు.