డైలీ భారత్ స్పెషల్ శీర్షిక:
శీర్షిక : శ్రమజీవి
శ్రమజీవుల అర కోర జీతాలతో బతుకుబండి ఈడ్చలేక ఖాళీ కడుపులతో జీవనం సాగిస్తున్నారు
ఆకాశాన్ని తాగిన సరుకుల ధరల సమ్మెట దెబ్బకి
నేలపై పడిన చేపపిల్లలా కుట్టుమిట్టాడు తున్నారు
నోట్లు తీసుకొని ఓట్లేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను నియంతృత్వంగా మారుస్తున్నాం మనం
చెమట పట్టిన చొక్కాల పరిస్థితి గందరగోళంగా మారుస్తున్నాం మనం
యాజమానుల చేతులలో శ్రమజీవులు గానిగెద్దు చాకిరీ చేస్తున్నా మానవత్వం లేకుండా వారి ఆనందాలు ఆవిరిచేస్తున్నారు
శ్రమజీవి కనురెప్పల మాటున దాగిఉన్న కన్నీరు తన్నుక రాగ మేఘం వర్షపు చినుకై ఓదార్పునిచ్చే
యజమాని విందు వినోదములో మునిగి తేలుతూ
శ్రమజీవి కన్నీరును గుర్తించలేకపోతున్నారు
వారికి మంచి రోజులు వస్తాయని రావాలి అని ఆశిస్తూ
మీ
మంజుల పత్తిపాటి
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణా రాష్ట్రం
చరవాణి 9347042218