| Daily భారత్
Logo




అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలి : ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ ఐఏఎస్ శశాంక

News

Posted on 2025-12-01 14:07:59

Share: Share


అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలి : ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ ఐఏఎస్ శశాంక

డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండలం ఫ్యూచర్ సిటీలో నిర్వహించే గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి పూర్తి కానీ పనులను వేగవంతగా పూర్తి చేయాలని, అధికారులు సమన్వయంతో పని చేయాలని  ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ ఐఏఎస్ శశాంక సంబంధిత అధికారులకు సూచించారు.

సోమవారం రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండలం ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8 మరియు 9వ తేదీలలో నిర్వహించే గ్లోబల్ సమ్మిట్ పై ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ ఐఏఎస్  శశాంక , రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్ బాబు, ప్రిన్సిపల్ పౌర సరఫరాల శాఖ సెక్రటరీ & కమిషనర్ డి.ఎస్.చౌహాన్ లతో కలిసి అన్ని విభాగాల ఏచ్ఓడిలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్లోబల్ సమ్మిట్ పనులు వేగవంతంగా పూర్తి చేసేలా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని, అధికారుల నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు. వివిధ దేశాల నుండి, రాష్ట్రాల నుండి వచ్చే అతిథులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్నీ రకాల సదుపాయాలను కల్పించాలని, ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా తమకు కేటాయించిన పనులను ప్రతి ఒక్కరు బాధ్యతగా నిర్వర్తించాలని సూచించారు.

విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని, ఇంటర్నెట్ సౌకర్యంలో అంతరాయం లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. రవాణా సౌకర్యం, త్రాగునీరు, మరుగుదొడ్లు, హెలిప్యాడ్లు, పార్కింగ్ స్థలాల ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను కోరారు. మెడికల్ సిబ్బందితో అవసరమైన వద్ద శిబిరాలను ఏర్పాటు చేయాలని సూచించారు.  గ్లోబల్ సమ్మిట్ కు వివిధ ప్రాంతాల నుండి దేశాల నుండి డెలిగేట్స్ వస్తున్న సందర్బంగా విమానాశ్రయం నుండి గ్లోబల్ సమ్మిట్ నిర్వహించే ప్రాంతం వరకు రోడ్లు పరిశుభ్రంగా ఉండాలని, గ్లోబల్ సమ్మిట్ నిర్వహించే ప్రాంతంలో పారిశుద్ద్యం చేపట్టాలని చెత్తను ఎప్పటికప్పుడు తరలించాలని, రోడ్లపై ఎక్కడ ఎలాంటి చెత్త లేకుండా చూడాలని సూచించారు. మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. అగ్నిపక శాఖ అధికారులు ఎలాంటి సంఘటనలు జరగకుండ చర్యలు చేపట్టాలని తెలిపారు.

గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లలో ఎక్కడ ఎలాంటి పొరపాట్లుకు తావ్వివకుండా పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.  ప్రతి ఒక్కరూ తమ విధులని బాధ్యతో నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

ఈ సమావేశంలో  ప్రోటోకాల్ సెక్రటరీ నర్సింహా రెడ్డి, అధికారులు ప్రేమ్ రాజ్,  హైదరాబాద్ మెట్రోపాలిటన్ నీటి సరఫరా బోర్డు ఎండి కె.అశోక్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రా రెడ్డి, ఆర్ అండ్ బి, ఫైర్ సేఫ్టీ, ట్రాన్స్పోర్ట్, ఆర్టీసీ, టిజిఎస్పీడిసిఎల్, టూరిజం, ఆరోగ్య శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు

Image 1

నలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరి, నలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులు

Posted On 2026-07-30 17:36:26

Readmore >
Image 1

సుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు

Posted On 2026-07-30 17:09:03

Readmore >
Image 1

సిరిసిల్ల : వర్షపు నీటితో అల్లాడుతున్న శ్రీనగర్ కాలనీవాసులు

Posted On 2026-07-30 16:35:13

Readmore >
Image 1

గణేష్ ఉత్సవాలకు ముందస్తు వ్యూహం

Posted On 2026-07-30 16:26:39

Readmore >
Image 1

వేములవాడ, సిరిసిల్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Posted On 2026-07-30 16:24:01

Readmore >
Image 1

హిందీ భాషాభివృద్ధి కి కృషి... హిందీ ఫోరం అధ్యక్షులు ఇంద్రశేఖర్

Posted On 2026-07-30 16:19:48

Readmore >
Image 1

ఆధునిక యుగంలో సామాజిక మార్పునకు సోషల్ మీడియా శక్తివంతమైన ఆయుధం : పద్మశ్రీ మందకృష్ణ మాదిగ

Posted On 2026-07-30 16:14:52

Readmore >
Image 1

సలబత్‌పూర్ చెక్‌పోస్ట్ ఘటనపై ప్రాథమిక విచారణకు ఆదేశాలు

Posted On 2026-07-30 16:09:18

Readmore >
Image 1

ఎక్కడ ఉన్నది న్యాయం ఎక్కడ ఉన్నది ధర్మం... మంజుల పత్తిపాటి

Posted On 2026-07-30 13:39:47

Readmore >
Image 1

సోనుసూద్ జన్మదిన వేడుకల్లో బిజెపి చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్

Posted On 2026-07-30 13:36:16

Readmore >