| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

యాంకర్ శివ జ్యోతి పై వెంటాడుతున్న వరస వివాదాలు

యాంకర్ శివ జ్యోతి పై  వెంటాడుతున్న వరస వివాదాలు

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి సొంత గ్రామస్తులనే మోసం చేసిన జ్యోతి పై మండిపడుతున్న నిజామాబాద్ జిల్లా వాసులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఇటీవల తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం పై అనుచిత వ్యాఖ్యలు చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన యాంకర్ శివ జ్యోతి చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారాన్ని రేపిన సంగతి విధితమే.. గులాబీల జెండాలు రామక్క పాట కోసం యూట్యూబ్ , ఇన్స్టా గ్రామ్ సెలబ్రిటీలతో మధ్యవర్తిత్వం తో వాళ్ళతో రీల్స్, షార్ట్స్ చేయించి కోటి 37 లక్షల రూపాయలు, థార్ కారు కొనుగోలు చేసి, మాజీ సీఎం కేసీఆర్ ని బాపు అని పిలవడం అందరికీ తెలిసిందే

అయితే తాజాగా ఆమె సొంత జిల్లా అయినా నిజామాబాద్ జిల్లాలో అభిమానులను బెట్టింగ్ యాప్స్ లో భాగంగా తాను ప్రమోట్ చేసిన వీడియోలను పలువురు యువకులు నమ్మి డబ్బులు పోగొట్టుకుని  ప్రాణాలు సైతం కోల్పోయిన విషయాలు బయటకు వస్తున్నాయి. ఒక దశలో ఆమెను తమ సొంత గ్రామస్తులు తమ గ్రామంలో ఇకపై ఆమెను అడుగు పెట్టించబోమని సదరుఅడుగు పెట్టించబోమని ఆమె గ్రామస్తులు ముక్తకంఠంతో సీరియస్ గా ఉన్నట్లు తెలిసింది.

Previous అరుణ్ ఐస్‌క్రీమ్ అద్భుతమైన ఐస్‌క్రీమ్ డోనట్‌లను ప్రారంభం
Next తిరుమల తిరుపతి పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో కనువిందుగా నృత్యాలు చేసిన కమలాపురం విద్యార్థినిలు
ADVERTISEMENT