| Daily భారత్
Logo




కాంగ్రెస్ బిఆర్ఎస్ రెండు పార్టీలు తెలంగాణకు తీవ్ర ద్రోహం చేశాయి

News

Posted on 2025-11-24 14:04:14

Share: Share


కాంగ్రెస్ బిఆర్ఎస్ రెండు పార్టీలు తెలంగాణకు తీవ్ర ద్రోహం చేశాయి

తెలంగాణ రాష్ట్ర రాష్ట్రీయ లోక దళ్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ విమర్శ

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: కాంగ్రెస్ బి ఆర్ ఎస్ రెండు పార్టీలు తెలంగాణకు, రాష్ట్ర ప్రజలకు తీవ్ర ద్రోహం చేశాయని తెలంగాణ రాష్ట్ర రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ విమర్శించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ముందుగా ఆయన మాట్లాడుతూ విద్య వైద్యం ఉపాధి వంటి కీలక వ్యవస్థలు రెండు పార్టీల వల్ల పూర్తిగా దెబ్బతిన్నాయని, ఇప్పటికీ కనీసం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి, 28 లక్షల వృత్తి నైపుణ్య శిక్షణలు పూర్తి చేయాలి, ఇందుకు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల ఐక్యతతోనే బహుజనులకు రాజకీయ అధికారం వస్తుందని, రాష్ట్రీయ లోక్ దళ్ యువతను రాజకీయాల్లోకి రాబోయేలా ప్రోత్సహిస్తుందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ వర్గాలకు అధిక శాతం సీట్లు కేటాయించి అవినీతి రహిత సమాజ నిర్మాణానికి తమ పార్టీ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు చెందవలసిన లాభాలను ప్రభుత్వం దారి మళ్ళించడాన్ని తీవ్రమైన అన్యాయంగా అభివర్ణిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పు కూడా పొందలేని దశకు చేరడం రేవంత్ రెడ్డి అసమర్థ పరిపాలన కారణమే అని విమర్శించారు. బీసీలకు 42 శాతం చట్టబద్ధ రిజర్వేషన్ అమలు చేసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలన్నది ఆర్ ఎల్ డి డిమాండ్ అని తెలిపారు. ఎన్నికల సమయంలో రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ విస్మరించిందని ప్రస్తుతం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బుస్సాపూర్ శంకర్ బిజెపి నాయకులు గౌరప్ప యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి మడకం ప్రసాద్ దొర రిషబ్ నరసింహారావు బుల్లెట్ వెంకన్న కళాబృందం రాష్ట్ర టీఆర్ఎల్ డి నాయకులు జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Image 1

కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్

Posted On 2026-09-09 14:45:53

Readmore >
Image 1

స్పీకర్ కు బీఆర్ఎస్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

Posted On 2026-09-09 14:29:32

Readmore >
Image 1

దేమేకలాన్ పాఠశాలలో ఘనంగా కలోజి నారాయణరావు జయంతి వేడుకలు

Posted On 2026-09-09 14:28:15

Readmore >
Image 1

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

Posted On 2026-09-09 08:35:55

Readmore >
Image 1

తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే

Posted On 2026-09-09 08:34:54

Readmore >
Image 1

నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం

Posted On 2026-09-08 18:02:08

Readmore >
Image 1

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాసం కుంకుమ పూజలు

Posted On 2026-09-08 18:01:01

Readmore >
Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >