| Daily భారత్
Logo




iBOMMA ఇక కనిపించదు... రవితోనే iBomma, బప్పం TV వెబ్‌సైట్‌ క్లోజ్ చేయించిన పోలీసులు

News

Posted on 2025-11-16 10:13:19

Share: Share


iBOMMA ఇక కనిపించదు... రవితోనే  iBomma, బప్పం TV వెబ్‌సైట్‌ క్లోజ్ చేయించిన పోలీసులు

డైలీ భారత్, హైదరాబాద్:తెలుగు సినీ పరిశ్రమను వణికించిన పైరసీ సైట్ల నిర్వాహకుడు ఇమ్మడి రవిని సైబర్ క్రైమ్ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. విడాకుల విషయంపై వివాదాలతో ఉన్న రవిపై కీలక సమాచారాన్ని అతడి భార్య పోలీసులకు అందించడంతో ఈ ఆపరేషన్ విజయవంతమైంది. ఫ్రాన్స్‌ నుంచి వచ్చిన రవిని కూకట్‌పల్లి వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతడి సమక్షంలోనే iBomma, బప్పం TV వంటి పైరసీ వెబ్‌సైట్లను పూర్తిగా మూసివేశారు. రవితో పాటు హార్డ్‌డిస్క్‌లు, బ్యాంక్ అకౌంట్లపై దర్యాప్తు కొనసాగుతోంది.

తెలుగు సినీ పరిశ్రమను ఏళ్ల తరబడి వణికించిన పైరసీ మాఫియాకు చెక్ పడింది. ఐబొమ్మ  బప్పం టీవీ వంటి పైరసీ వేదికల ప్రధాన నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ కావడమే కాదు, అతని అరెస్టుకు కారణమైన నేపథ్యం బయటకు రావడం మరింత సంచలనం గా మారింది. ఈ మొత్తం ఆపరేషన్ వెనుక రవి భార్య కీలక పాత్ర పోషించిందన్న విషయమే ఇప్పుడు ఇంటర్నెట్‌ను కుదిపేస్తోంది. విదేశాల్లో ఉంటోన్న రవికి కొంతకాలంగా భార్యతో విభేదాలున్నాయి. ఆ నేపథ్యంలోనే విడాకుల చర్చ కోసం రవి హైదరాబాద్‌కు వస్తున్న సమాచారాన్ని ఆమె గోప్యంగా సైబర్ క్రైమ్ అధికారులకు అందించడంతో పోలీసులు ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఆమె అందించిన టైమ్‌లైన్, లొకేషన్ వివరాల ఆధారంగా రవిని ట్రాక్ చేసిన పోలీసులు, ఫ్రాన్స్ నుండి అర్థరాత్రి హైదరాబాద్ చేరుకున్న రవిని కూకట్‌పల్లి వద్ద అదుపులోకి తీసుకున్నారు.

రవిని అరెస్ట్ చేయడంతోనే కాదు.. అతను కొన్నాళ్లుగా నడిపిస్తోన్న పైరసీ సామ్రాజ్యాన్ని పూర్తిగా నిలిపివేయించడంలో పోలీసులు విజయం సాధించారు. ‘నా వద్ద కోట్ల మంది డేటా ఉంది… ఈ వెబ్‌సైట్‌ను టచ్ చేయొద్దు’ అంటూ రవి గతంలో పోలీసులుపై విసిరిన సవాలే ఈ కేసులో మలుపు తెచ్చింది. అరెస్టు అనంతరం రవి ల్యాప్‌టాప్‌లు, వెబ్ లాగిన్‌లు, సర్వర్ వివరాలను పోలీసులు స్వాధీనం చేసుకుని అతడి సమక్షంలోనే iBomma, బప్పం TV వంటి పైరసీ వేదికలను శాశ్వతంగా బ్లాక్ చేయించారు. విదేశీ సర్వర్ల ద్వారా నడుస్తున్న ఈ ప్లాట్‌ఫార్మ్‌లను డీయాక్టివేట్ చేయడంలో రవి సహకారం తీసుకోవడం పోలీసుల వ్యూహాత్మక విజయంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పోలీసులు రవి నుంచి స్వాధీనం చేసుకున్న వందల సంఖ్యలో హార్డ్‌డిస్క్‌లను, అతని బ్యాంక్ లావాదేవీలను, పైరసీ ద్వారా వచ్చిన అక్రమ ఆదాయ మార్గాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ పైరసీ నెట్‌వర్క్ వెనుక ఉన్న ఇతర వ్యక్తులపై కూడా దర్యాప్తు ప్రారంభమైంది. రవిని మరింత సమాచారం కోసం కస్టడీకి తీసుకోవాలని సైబర్ క్రైమ్ విభాగం సోమవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది.

Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చూపిన జూలూరుపాడు ఆరోగ్య జీవన యాత్ర మండల వాసులు

Posted On 2026-07-27 17:05:43

Readmore >
Image 1

డైరీ విద్యార్థులకు నాణ్యమైన నూతన విద్యా విధానం అమలు చేయాలి వైస్ ఛాన్స్ లర్..డాక్టర్ జ్ఞాన ప్రకాష్

Posted On 2026-07-27 15:43:01

Readmore >
Image 1

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను తొలగించండి...

Posted On 2026-07-27 15:39:03

Readmore >
Image 1

RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం

Posted On 2026-07-27 14:31:47

Readmore >
Image 1

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-07-27 14:26:00

Readmore >
Image 1

రేగళ్ల PHC ఆకస్మిక తనిఖీ... సకాలంలో నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశం

Posted On 2026-07-27 14:24:02

Readmore >
Image 1

సీతారామ ప్రాజెక్టు రూపురేఖలు మార్చకుండా రైతులకు సాగునీరు అందించాలి

Posted On 2026-07-27 14:06:55

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇండ్ల పేరుతో వసూళ్లు... కేటీఆర్ మౌనంపై బీజేవైఎం ఆగ్రహం

Posted On 2026-07-27 08:16:22

Readmore >
Image 1

అధిరణ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరై ఆశీర్వదించిన వెంకట సాయి నగర్ కాలనీ ప్రతినిధులు

Posted On 2026-07-27 07:39:23

Readmore >
Image 1

ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న సమస్యల పరిష్కారంలో విఫలం

Posted On 2026-07-27 06:58:57

Readmore >