Posted on 2025-11-05 17:39:41
చనిపోయినా బాధ్యత కుటుంబాలని ప్రభుత్వం దత్తత తీసుకోవాలి
తిలాపాపం తలా పిడికెడు
చేవెళ్ల దుర్ఘటనలో ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన వారికి* *మా నిరుపేదల హక్కుల సాధన సమితి తమ ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని ప్రకటించారు
డైలీ భారత్ న్యూస్, మెదక్/ సిద్దిపేట:ఉమ్మడి మెదక్ సిద్దిపేట జిల్లా నిరుపేదల హక్కుల సాధన సమితి సిద్దిపేట జిల్లా కన్వీనర్ మూర్తి ఆగిరెడ్డి బస్సు దుర్ఘటనలో చనిపోయిన వారి గురించి ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు అనంతరం
వివరాలకు వెళితే
ప్రియమైన ప్రజలారా బుద్ధి జీవులారా ముఖ్యoగా పేద మధ్యతరగతి ప్రజలారా ఈ సంఘటన ఒక సంఘటనగా మాత్రమే చూస్తే దీని లోతు పాతులు మనకు అర్థం కావు అని మూర్తి ఆగి రెడ్డి అన్నారు అనంతరం ఇది జరగడానికి కేవలం ఇద్దరూ డ్రైవర్ నిర్లక్ష్యం( వాళ్లు ఆల్రెడీ స్పాట్లోనే చనిపోయారు) గానే కనబడుతుంది కానీ టిప్పర్ డ్రైవర్ కైనా ఆర్టీసీ బస్సు డ్రైవర్ కైనా పని ఒత్తిడి వేర్వేరుగా ఉంటుంది అన్న విషయం మనం గమనించాలి అని అన్నారు అదేవిధంగా మనం టిప్పర్ డ్రైవర్ విషయం తీసుకుంటే అక్కడి నుండి వచ్చే టిప్పర్ మొత్తం మెహిదీపట్నం రాజేంద్రనగర్ చేవెళ్ల ఈ ఏరియాలో పరిధిలో ఉన్నటువంటి జరుగుతున్న కన్స్ట్రక్షలకు కంకర పోయడం జరుగుతుందని చెప్పారు అనంతరం ఫలానా వ్యక్తికి ఫలానా టైం వరకు నీవు ఆ కంకర కచ్చితంగా పోయాలి అన్న క్రషరు మరియు టిప్పర్ యజమాని వత్తిలా కారణంగా వేగంగా నడపడం వల్ల జరిగిన సంఘటన గ చుడ వచ్చు లేదు అంటే డ్రైవరు డబల్ డ్యూటీ చేయడం మూలం గా జరిగిన సంఘటనగా మనం అర్థం చేసుకోవాలని జిల్లా కన్వీనర్ మూర్తి ఆగి రెడ్డి కోరారు అలాగే ఆర్టీసీ డ్రైవర్ విషయానికొస్తే ఈరోజుల్లో ఆర్టీసీలో నేర్పించే వాళ్లలో నూటికి 75% డ్రైవరు శిక్షణ తీసుకున్న డ్రైవరు కాదు వారు బయట టిప్పర్లు లారీలు ప్రైవేట్ బస్సులు నడిపించినటువంటి డ్రైవర్లని ప్రభుత్వంతీసుకుంటుంది లేదు అక్కడున్న రికగ్నైజేడు బస్సులు ఏవైతే ఉంటాయో ఆ ప్రైవేట్ వ్యక్తులు ప్రైవేట్ డ్రైవర్ ని పెట్టు కోవడం జరుగుతుందని తెలిపారు అనంతరం అయితే ఆర్టీసీ డ్రైవర్ కూడా పర్మినెంట్ అతను కాదు ఇక్కడ మనం గమనించ వలసిన విషయం ఏమిటంటే ఆర్టీసీ డ్రైవర్ పర్మినెంట్ కాని వ్యక్తి ఎలా ఉంటుందంటే ఈ డ్యూటీ తొందరగా అయిపోవుట్టుకొని ఇంకొక డ్యూటీకి నేను జాయిన్ కావాలి అన్నా తొందరపాటు వాళ్లలో ఉంటుందని దీనికి కారణాలు అనేకం ఉన్నాయి అన్నారు అనంతరం పెరుగుతున్న ధరలకు వచ్చే జీతానికి సరిపోక వారు కుటుంబాన్ని వదిలి 24 గంటలు పని చేయవలసిన పరిస్థితి దాపురిస్తుంది కాబట్టి డ్రైవర్ల నిలరక్షము అనేది ఇందులో ఎంత మాత్రమూ లేదు ఎందుకంటే ఎవరు కూడా వారి ప్రాణాల్ని పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉండరు కదా అని అన్నారు అనంతరం ఇకపోతే అప్పా జంక్షన్ నుండి తాండూర్ వరకు మొత్తము దాదాపుగా 90 కిలోమీటర్ల దూరం వరకు ఉంటుంది మనం ఎంజీబీఎస్ నుంచి మొదలుకుంటే తాండూర్ వరకు 110 కిలోమీటర్ల తారు రోడ్డు పేరుకు మాత్రమే అది నేషనల్ హైవే కానీ గ్రామాలలో ఉన్నటువంటి గల్లీ రోడ్డు కంటే అధ్వానంగా ఉంటుందని ప్రజలు గ్రహించాలి అని సూచించారు ఆ రోడ్డులో అనుభవం ఉన్న డ్రైవరు నడిపించాలి అంటే 50 నుండి 60 స్పీడ్ కంటే ఎక్కువ పోకూడదు మొత్తం 110 కిలోమీటర్ల రోడ్డులో కేవలం 25 కిలోమీటర్ రోడ్డు వరకు మాత్రమే 60 నుంచి 70 స్పీడ్ వరకు వెళ్లవచ్చు అని అన్నారు అనంతరం లేదంటే 30 నుండి 40 స్పీడ్ వెళితేనే ఆ రోడ్లో ఎవరైనా సేఫ్ గా పోయి రాగలరు ఇటువంటి రోడ్డుని గతంలో అధికారంలో ఉన్న బి ఆర్ఎస్ గాని ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గాని పట్టించు కోకపోవడం మూలంగానే ఇటువంటి దుర్ఘటనలు జరుగుతున్నవి అని ప్రజలు తెలుసుకోవాలి అని అన్నారు ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాయలసీమను ఆంధ్ర పాలకులు సవదితల్లి ప్రేమ ఎలా ఓ లకబోశారో అదేవిధంగా ఇప్పుడున్న సమాజం రంగారెడ్డి జిల్లా ప్రజల మీద పాలకులు మన తెలంగాణ పాలకులే సవితల్లి ప్రేమను ఉల్కబోస్తున్నారు అని ప్రజలు గ్రహించాలి అని కోరారు కాబట్టి పదవులు రాలేదని ఒక పార్టీ నుండి ఇంకొక పార్టీలోకి మారిన నేతలు మరి ప్రజలకు జరిగిన అన్యాయం గురించి తమ పదవులకు రాజీనామా చేస్తారా అని నిరుపేద హక్కుల సాధన సమితి డిమాండ్ చేస్తుందని ఆగ్రం వ్యక్తపరిచారు. ఇప్పటికైనా ప్రజలు ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఆలోచించాలి రాజకీయ,నాయకులకు మన ఓట్లు కావాలి తప్ప మన బాగోగులు వారికి అవసరం లేదు అని తెలిపారు అనంతరం ఓటు కోసం వచ్చినప్పుడు మీరు డబ్బులు తీసుకోకుండా కులము మతం చూడకుండా మంచి వ్యక్తిని గెలిపించుకొని మీ సమస్యలకు పరిష్కారా మార్గన్ని చూపించే వేక్తిని ఎన్నుకొని సమస్య లకు పరిష్కారం చూపించమనండి ఉచితలకు ఆశపడకండి నెలకు 2000 &4000 పెన్షన్ కోసం మీకు ఇచ్చే బదులు నీ కొడుకు నీ కోడలు నీ మనుమడు నీ మనుమరాలకు ఉద్యోగాన్ని కల్పించాలని డిమాండ్ చేయాలి అని తెలిపారు అనంతరం జీతం వారికి 30 నుండి 40వేలు నెలకు వస్తే వారి నుండి మీరు అవే రెండు వేలు రూపాయలు తీసుకోవచ్చును అని అన్నారు అదేవిధంగా కేవలం నీ రెండు వేల పెన్షన్ కోసం మీ కుటుంబంలోని ఉద్యోగం లేకుండా పోతుంది కాబట్టి ప్రజలు ఈ విషయాలపై ఆలోచించాలి ఇకపోతే అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే చేవెళ్లేవారు చనిపోతేనే అక్కడికి వెళ్లి పలకరిస్తాను లేదంటే నేను ఎందుకు పలకరించాలి అన్న ధోరణి లో వున్నాడు ఒక టీచర్ మాట్లాడితే అతనితో అన్న మాటలు ఇవి అయ్యా గౌరవ ఎమ్మెల్యే మీ నియోజకవర్గంలో ప్రపంచంలో దేశంలో ఎక్కడి వారైనా ఇక్కడ బాధితులుగా ఉన్నప్పుడు అది మీ నియోజకవర్గ పరిధి లోకి వస్తుంది కాబట్టి తప్పనిసరిగా మీరు ప్రాంతము కులము మతము అని లెక్కబెట్టకుండా ఒక మనిషిగా పలకరించే కనీస బాధ్యత నీది కాబట్టి ఎటువంటి వారిని,ఎన్నుకున్నాము అన్నది ప్రజలు ఆలోచించాలి అదేవిధంగా నోటితో పిలిచి నొసటితో వెక్కిరించే విధంగా కేవలం సానుభూతి పలుకులు రెండు నుంచి ఐదు లక్షల వరకు ఎక్స్గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకోకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చనిపోయిన కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు
1 మృతి చెందిన కుటుంబాలకు మనిషి ఒక్కంటికి 50లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలి అదేవిధంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల్ని రాష్ట్ర ప్రభుత్వమే దత్తత తీసుకొని వారికి సరైన వసతి కల్పించాలి
2 గాయపడ్డ ప్రతి ఒక్కరికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి
3 ఈ పరిహారాన్ని క్రషర్ యజమానుల నుండి ఇప్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వము కృషి చేయాలి
4 వారికి జరిగిన నష్టపరిహారాన్ని చెల్లించడంతోపాటు ఆ కుటుంబాలు అర్హులైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నిరుపేద హక్కుల సాధన సమితి జిల్లా కన్వీనర్ మూర్తి ఆగి రెడ్డి డిమండు చేశారు
అర్జీలు సకాలంలో పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-25 17:15:49
Readmore >
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం
Posted On 2026-05-25 15:10:05
Readmore >
అన్ లోడింగ్ లో జాప్యం కాకుండా పర్యవేక్షణ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-25 10:43:55
Readmore >
తల సేమియా చిన్నారుల కోసం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం
Posted On 2026-05-24 21:12:46
Readmore >