డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:రాష్ట్ర షెడ్యూలు, తెగల కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య ఇటీవల హత్యకు గురైన సి సి ఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కుటుంబ సభ్యులను శనివారం పరామర్శించారు. ప్రమోద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విధి నిర్వహణలో కానిస్టేబుల్ హత్యకు గురి కావడం ఎంతో బాధ కలిగించిందన్నారు. బాధిత కుటుంబానికి కమిషన్ అండగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా చూస్తానన్నారు.
News
కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబసభ్యులను పరామర్శించిన ఎస్సీ, ఎస్టి కమిషన్ ఛైర్మన్