| Daily భారత్
Logo




దేశ ఐక్యతను తెలిపే విధంగా ర్యాలీ... నినాదాలతో హోరెత్తించిన స్నేహ సొసైటీ మానసిక దివ్యంగ విద్యార్థులు

News

Posted on 2025-10-31 15:39:29

Share: Share


దేశ ఐక్యతను తెలిపే విధంగా ర్యాలీ... నినాదాలతో హోరెత్తించిన స్నేహ సొసైటీ మానసిక దివ్యంగ విద్యార్థులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:మానసిక  దివ్యాంగ విద్యార్థులు దేశ ఐక్యత తెలిపే దిశగా ర్యాలీ చేపట్టి నినాదాలతో హోరెత్తించారు స్నేహ సొసైటీ దివ్యాంగ విద్యార్థులు... నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్ లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాల ఆధ్వర్యంలో మానసిక, దివ్యాంగ మరియు  అంద, విద్యార్థినీ విద్యార్థులు ఉపాధ్యాయ బృందం ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు.. ఈ ర్యాలీ స్నేహ సొసైటీ పాఠశాల నుండి పురవీధుల గుండా కొనసాగించి దేశ ఐక్యతను చాటి చెప్పే విధంగా ఐక్యమత్యమే మహాబలం, హమ్ సబ్ ఏక్ హై , యునైటెడ్ వి స్టాండ్, మేరా భారత్ మహాన్ అనే నినాదాలతో దేశ ఐక్యతను పురవీధుల గుండా సాగుతూ చాటిచెప్పారు... ఈ ర్యాలీ అనంతరం స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాలలో ఏర్పాటుచేసిన దేశ ఐక్యత ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో భాగంగా స్నేహ సొసైటీ,కార్యదర్శి ఎస్ సిద్దయ్య, అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్ జ్యోతి, మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సి పాల్ రాజేశ్వరి మాట్లాడుతూ శాంతి అహింస అనే నినాదంతో జాతిపిత మహాత్మా గాంధీ స్వాతంత్రం కోసం పోరాడడం జరిగిందన్నారు.. అయితే స్వాతంత్ర్య అనంతరం వివిధ సంస్థానాదిశుల పాలనలో ఉన్న రాష్ట్రాలను , ఈశాన్య భారతంలో భాగమైన కొన్ని రాష్ట్రాలను,నైజాం పాలనలో ఉన్న హైదరాబాద్ మరియు తెలంగాణ రాష్ట్రాలను భారత యూనియన్ లో కలిపారు.దేశ సమగ్రత దేశ ఐక్యత కుల మతాలకతీతంగా ప్రతి ఒక్కరు ఐక్యతగా ఉండాలని పోరాడిన గొప్ప వ్యక్తి ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని వారు తెలిపారు.. అలాగే ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్  వ్యవసాయ రైతాంగం దీనస్థితిలో ఉన్న వారికి సైతం వెన్నుదన్నుగా ఉండి పోరాడడం వల్ల అన్నదాతలు సర్దార్ వల్లభాయ్ పటేల్ గా పిలవడం జరిగిందని తెలిపారు.. అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను 2014 నుండి నిర్వహిస్తున్నప్పటికీ ఈ సంవత్సరం మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆదేశానుసారం ప్రతి ఒక్కరికి దేశ సమైక్యత సౌభాతృత్వం మానసిక దివ్యాంగులే కాకుండా ప్రతి ఒక్కరికి తెలియపరిచే దిశగా వచ్చిన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు... ప్రతి ఒక్కరూ కులమాతాలకతీతంగా కలిసి ఉన్నప్పుడే దేశ ఐక్యత ఇతర దేశాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని వారు సూచించారు...


ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్దయ్య , అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి, మానసిక దివ్యాంగుల పాఠశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి,ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు...

Image 1

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..

Posted On 2026-07-28 08:50:30

Readmore >
Image 1

గోమాతను విశ్వమాతగా ప్రకటించాలని ర్యాలీ, కలెక్టర్ కు వినతి పత్రం అందజేత

Posted On 2026-07-28 08:06:38

Readmore >
Image 1

అర్ధరాత్రి అప్రమత్తతతో వ్యక్తి ప్రాణాలు కాపాడిన రాజాపూర్ పోలీసులు

Posted On 2026-07-28 08:04:20

Readmore >
Image 1

శబరిమల దేవస్థానం ప్రధాన తంత్రిగా బ్రహ్మదత్తన్

Posted On 2026-07-28 02:28:38

Readmore >
Image 1

మతం మారితే..ఎస్సీ హోదా కోల్పోతారు

Posted On 2026-07-28 02:27:11

Readmore >
Image 1

అంగమలి - శబరిమల రైలు మార్గం భూసేకరణ ప్రారంభించిన కేరళ ప్రభుత్వం

Posted On 2026-07-27 18:35:56

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చూపిన జూలూరుపాడు ఆరోగ్య జీవన యాత్ర మండల వాసులు

Posted On 2026-07-27 17:05:43

Readmore >
Image 1

డైరీ విద్యార్థులకు నాణ్యమైన నూతన విద్యా విధానం అమలు చేయాలి వైస్ ఛాన్స్ లర్..డాక్టర్ జ్ఞాన ప్రకాష్

Posted On 2026-07-27 15:43:01

Readmore >
Image 1

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను తొలగించండి...

Posted On 2026-07-27 15:39:03

Readmore >
Image 1

RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం

Posted On 2026-07-27 14:31:47

Readmore >