Posted on 2025-10-31 07:26:45
మండలాల బాధ్యులకు అంబులెన్స్ లను అప్పజెప్పిన ఎమ్మెల్యే
డైలీ భారత్, షాద్ నగర్ :షాద్ నగర్ నియోజకవర్గంలోని ఫరూక్ నగర్, కొత్తూరు, కొందుర్గు కేశంపేట నందిగామ ఉమ్మడి మండలాలకు ఒక్కో అంబులెన్స్ చొప్పున లిమ్స్ శంషాబాద్ ఆసుపత్రి వారి సౌజన్యంతో నేటినుండి సేవలు అందుబాటులోకి వచ్చాయని షాద్ నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయా మండలాల అంబులెన్స్ బాధ్యులకు వాటిని అప్పచెప్పారు. ఇటీవల విజయదశమి పండుగ రోజున అంబులెన్స్లను నూతనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే శంకర్ దానికి సంబంధించిన సిబ్బందిని ఏర్పాటు చేసి వారికి శిక్షణను అందజేసి నేడు పూర్తిస్థాయిలో మండలాలకు సేవల కోసం వారికి స్వాధీన పరిచినట్లు ఎమ్మెల్యే చెప్పారు. శంషాబాద్ లిమ్స్ ఆస్పత్రి యజమాని రామరాజు సహకారంతో ఈ అంబులెన్స్ సేవలను పేద ప్రజలకు ఉచితంగా పెట్టేందుకు ముందుకు రావడం విశేషమని తెలిపారు. తన రాజకీయ అభివృద్ధి తో పాటు అనేక అంశాల్లో సహకరిస్తూ నియోజకవర్గ ప్రజలకు తమ వంతు సహకారం అందించే విధంగా అంబులెన్స్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి పేదవాడు ఈ అంబులెన్స్ సేవలను ఉచితంగా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, షాద్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంకళ్ళ చెన్నయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఆగిర్యల కృష్ణ రెడ్డి, చెంది తిరుపతి రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చల్ల శ్రీకాంత్ రెడ్డి, జంగ నర్సింహులు, హరినాథ్ రెడ్డి, గూడ విరెష్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పి వెంకట్ రాంరెడ్డి, కొత్తూరు కాంగ్రెస్ మున్సిపల్ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్,కాంగ్రెస్ పార్టీ నేతలు అగ్గనుర్ బస్వం, సురేష్ రెడ్డి, జాకరం చంద్ర శేఖర్, యెన్నం శ్రీధర్ రెడ్డి , గిరి యాదవ్, చంద్ర పాల్ రెడ్డి, కొప్పునుర్ ప్రవీణ్ త్రిప్పిశెట్టి కర్ణకర్, కొమ్ము కృష్ణ, బాధేపల్లి సిద్దార్థ, జాంగారి రవి, హైదర్ ఘోరీ, నెహ్రూ నాయక్, రాజు నాయక్, సుమన్ నాయక్, అన్వర్, అప్పరెడ్డిగూడ మల్లేష్,భాస్కర్ గౌడ్, లింగారెడ్డి గూడ అశోక్, ఖదీర్,సీతారాం, సుఖ్య నాయక్, రాందాస్ నాయక్, బసప్పా, నాగి సాయిలు, కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.
సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-29 16:22:04
Readmore >
వర్షాల వేళ అప్రమత్తంగా కామారెడ్డి పోలీసులు – ప్రజల భద్రతకు ముందస్తు చర్యలు
Posted On 2026-07-29 16:19:52
Readmore >
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు... ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి
Posted On 2026-07-29 16:14:43
Readmore >
ఎమ్మార్పీఎస్ కామారెడ్డి నియోజకవర్గ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసిన జిల్లా ఇన్చార్జ్
Posted On 2026-07-29 08:54:06
Readmore >
చింతపూడి యుగంధర్ పార్దివదేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎడవల్లి కృష్ణ
Posted On 2026-07-29 08:52:51
Readmore >