| Daily భారత్
Logo




బిజెపి అభ్యర్థికి మద్దతుగా ఇంటింటికి ప్రచారం నిర్వహించిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే

News

Posted on 2025-10-29 15:10:44

Share: Share


బిజెపి అభ్యర్థికి మద్దతుగా ఇంటింటికి ప్రచారం నిర్వహించిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజెపి అభ్యర్థికి మద్దతుగా ఇంటింటికి ప్రచారం నిర్వహించిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే

 డైలీ భారత్ న్యూస్, హైదరాబాద్:జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బుధవారం నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ రహమత్ నగర్ డివిజన్ పరిధిలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ కి మద్దతుగా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ  మాట్లాడుతూ గత పదేళ్లుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి పట్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చూపిందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైందని విమర్శించారు.

ప్రజల ఆకాంక్షలు నెరవేర్చగల పార్టీగా, పారదర్శక పాలనతో ప్రజల విశ్వాసం గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రజలకు నిజమైన ప్రత్యామ్నాయమని తెలిపారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సమగ్ర అభివృద్ధి తీసుకురావగల నాయకుడు లంకల దీపక్  మాత్రమే అని అన్నారు. ఎల్లప్పుడూ ప్రజలతో మమేకమై సేవ చేసేవారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఆయనకు అండగా నిలిచి గెలిపించి కాంగ్రెస్ ముసుగులో ఉన్న మజ్లిస్ నేతలకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  బీజేపీ అభ్యర్థి తరపున ఇంటింటికి వెళ్లి, ప్రజల మద్దతు కోరారు. ప్రచారంలో పాల్గొన్న బీజేపీ నాయకులు, స్థానిక కార్యకర్తలు ప్రజల ఉత్సాహభరితమైన స్పందనను చూసి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు తంగెళ్లపల్లి లక్ష్మణ్, సౌభాగ్య లక్ష్మీ బీజేపీ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు,మల్లేష్ గుప్తా సీనియర్ నాయకులు,బట్టికిరి ఆనంద్,మరవర్ కృష్ణ,బాలనగేష్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Image 1

ఆప్త మిత్రుడు పెద్ది అకాల మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ వద్దిరాజు

Posted On 2026-07-31 13:26:11

Readmore >
Image 1

లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో శిఖర పూజ, ధ్వజారోహణ..

Posted On 2026-07-31 12:56:48

Readmore >
Image 1

మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు నమోదు

Posted On 2026-07-31 12:28:25

Readmore >
Image 1

శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

Posted On 2026-07-31 07:29:30

Readmore >
Image 1

మహారాష్ట్రలో మరో భవన ప్రమాదం... భివండిలో అర్ధరాత్రి కూలిన అపార్ట్‌మెంట్

Posted On 2026-07-31 07:06:38

Readmore >
Image 1

పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు : బాదావత్ బాలాజీ

Posted On 2026-07-31 05:05:36

Readmore >
Image 1

కరెంట్ షాక్ తో చనిపోతే ఇచ్చే పరిహారం రూ.8లక్షలకు పెంపు

Posted On 2026-07-31 05:04:07

Readmore >
Image 1

సీనియర్ న్యాయవాది రజాక్ మృతి తీరని లోటు : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

Posted On 2026-07-31 05:03:03

Readmore >
Image 1

అశ్వాపురం మండలంలో సీతారామ పంప్ హౌస్ ను సందర్శించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు పవని గౌడ్

Posted On 2026-07-31 05:01:23

Readmore >
Image 1

నలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరి, నలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులు

Posted On 2026-07-30 17:36:26

Readmore >