డైలీ భారత్, జగిత్యాల: కొడిమ్యాలకు చెందిన మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు లంక దాసరి మల్లేశంకు జగిత్యాల న్యాయమూర్తి నారాయణ సోమవారం 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ. 25,000 జరిమానా విధించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 2021లో నిందితుడిపై పోక్సో చట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు అయినట్లు ఆయన పేర్కొన్నారు.
News
ఫోక్సో కేసులో నిండితునికి 10 సంవత్సరాల జైలు శిక్ష