Posted on 2025-10-27 16:38:48
డైలీ భారత్, గంగాధర:గంగాధర మండలం కురిక్యాల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకున్న అమానుష ఘటన స్థానిక ప్రజలను, విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. పాఠశాలలో పని చేస్తున్న అటెండర్ యాకుబ్ పాషా గత ఏడాదికాలంగా పాఠశాలలో చదువుకుంటున్న అమ్మాయిలను వేధిస్తున్నాడనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే ఆ పాఠశాలలో పనిచేస్తున్న అటెండర్ అమ్మాయిలను తరచుగా అనవసరంగా మాట్లాడటం, బాత్రూం వైపు వెళ్తున్నప్పుడు వారి ఫోటోలు మొబైల్‌లో తీయడం తో పాటు రహస్యంగా కెమెరాలు పెట్టడం లాంటి చర్యలకు పాల్పడుతున్నాడని విద్యార్థినులు తెలిపారు. అతను తీసిన ఫోటోలను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తూ విద్యార్థులను మానసికంగా వేధించినట్లు సమాచారం.
ఈ వ్యవహారం గత కొంతకాలంగా కొనసాగుతుండగా, విద్యార్థులు మరియు కొందరు తల్లిదండ్రులు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలికి, ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేసినప్పటికీ, వారు పెద్దగా స్పందించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ఘటన ఇంత పెద్ద స్థాయికి చేరిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థిని ధైర్యం చేసి తన తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో ఈ ఘటన బయటపడింది. గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగి, పాఠశాల వద్ద తల్లిదండ్రులు, ప్రతినిధులు భారీగా చేరి నిరసనలు వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. విద్యార్థుల వాంగ్మూలాలు, మొబైల్ ఫోన్ తో పాటుగా అటెండర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
"పిల్లలు పాఠశాలకు భయంతో వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. మా పిల్లలకు న్యాయం చేయాలి, బాధ్యులందరిపై చర్యలు తీసుకోవాలి" అంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఘటన వెలుగులోకి రావడంతో గ్రామమంతా ఆగ్రహావేశానికి లోనైంది. గ్రామ పెద్దలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు కలిసి ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి. పాఠశాల సిబ్బందిని తక్షణమే సస్పెండ్ చేయాలని, అటెండర్‌కు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >