| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

డ్రగ్స్ పైచైతన్యం డ్రగ్స్ పై యుద్ధం సుజాతనగర్ పోలీస్ ఆధ్వర్యంలో ప్రధానసెంటర్లో ఏర్పాటు

డ్రగ్స్ పైచైతన్యం డ్రగ్స్ పై యుద్ధం సుజాతనగర్ పోలీస్ ఆధ్వర్యంలో ప్రధానసెంటర్లో ఏర్పాటు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రికొత్తగూడెం జిల్లా సుజాతనగర్ ప్రధాన సెంటర్లో " చైతన్యం, డ్రగ్స్ పై యుద్ధం"  ప్రోగ్రాం సుజాతనగర్ ప్రధాన సెంటర్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ బిరుదు రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారుఈ కార్యక్రమానికి కొత్తగూడెం సబ్ డివిజన్ డిఎస్పి అబ్దుల్ రెహమాన్ , మరియు చుంచుపల్లి సిఐ రాయలవెంకటేశ్వర్లు , సుజాతనగర్ ఎస్సై మాలోత్ రమాదేవి  మరియు సిబ్బంది పాల్గొన్నారు. ప్రోగ్రాంలో అబ్దుల్ కలాం కాలేజ్,  ధన్వంతర కాలేజ్ , శ్రీ కాలేజ్ మరియు సుజాతనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు, సుజాతనగర్ మండలం వివిధ పార్టీ రాజకీయ నాయకులు,  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు పాల్గొన్నారుడ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ఈనెల 15వ తారీకు నుండి వచ్చే నెల 15వ తారీకు వరకు  చైతన్యo ప్రోగ్రాంలో భాగంగా ప్రజలకు డ్రగ్స్ గురించి అవగాహన కలిగించడానికి ప్రోగ్రాములు నిర్వహించడం జరుగుతుంది. 

డ్రగ్స్ అమ్మకం, రవాణా, కలిగి ఉండడం, సేవించడం, కొనడం చట్టరీత్యా నేరం.  అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎటువంటి సమాచారం తెలిసిన వెంటనే 100కు డయల్ చేయండి లేదా దగ్గర్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ వారికి సమాచారం ఇవ్వండి ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు

Previous ప్రతి పేద మహిళ స్వయం సహాయక సంఘాల్లో ఉండాలి
Next ఘనంగా కీర్తిశేషులురోకటి సురేష్ జన్మదిన వేడుకలు
ADVERTISEMENT