| Daily భారత్
Logo




బంజారాహిల్స్లో సె*క్స్ రాకెట్ గుట్టురట్టు.. విదేశీ యువతి సహా పలువురు అరెస్ట్

News

Posted on 2025-10-23 20:53:21

Share: Share


బంజారాహిల్స్లో సె*క్స్ రాకెట్ గుట్టురట్టు.. విదేశీ యువతి సహా పలువురు అరెస్ట్

బంజారాహిల్స్‌ హోటల్‌లో వ్యభిచారం

ప్రధాన నిర్వాహకుడితో పాటు ఏడుగురు విటులు, రిసెప్షనిస్ట్ అరెస్ట్

యువతులకు ఉద్యోగాల ఆశ చూపి వ్యభిచారం

నిందితుల నుంచి నగదు, 13 మొబైల్ ఫోన్లు స్వాధీనం

డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో గుట్టుగా సాగుతున్న ఓ భారీ వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు ఛేదించారు. నగరంలోని ఓ ప్రముఖ హోటల్‌ను కేంద్రంగా చేసుకుని సాగుతున్న ఈ దందాపై కమిషనర్ టాస్క్‌ఫోర్స్, బంజారాహిల్స్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి నిర్వాహకులతో పాటు విటులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా చెర నుంచి ఉజ్బెకిస్థాన్ యువతితో సహా ముగ్గురు మహిళలను రక్షించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఆర్-ఇన్ హోటల్‌లో వ్యభిచారం జరుగుతున్నట్లు పక్కా సమాచారం అందింది. దీంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులతో కలిసి హోటల్‌లోని 111, 112 నంబర్ గదులపై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ప్రధాన నిర్వాహకుడైన ఎండీ షరీఫ్‌ను అరెస్ట్ చేశారు. అతనితో పాటు ఏడుగురు విటులను, హోటల్ రిసెప్షనిస్ట్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. విటులంతా కర్నూలుకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు.

‘స్టైల్ మేకర్ సెలూన్’ యజమాని అయిన ఎండీ షరీఫ్, ఆర్థికంగా వెనుకబడిన, ఉద్యోగాలు లేని యువతులను లక్ష్యంగా చేసుకుని ఈ దందాను నడుపుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వారికి పెద్ద మొత్తంలో జీతాలు, కమీషన్లు ఇస్తామని ఆశ చూపి వ్యభిచార కూపంలోకి దింపుతున్నాడని పోలీసులు వెల్లడించారు.

నిందితుల నుంచి రూ. 5,950 నగదు, 13 మొబైల్ ఫోన్లు, 12 వాడని కండోమ్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన నిందితులను, స్వాధీనం చేసుకున్న సొత్తును తదుపరి విచారణ నిమిత్తం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 11:51:25

Readmore >
Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 21:54:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 08:04:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 19:39:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 19:32:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 19:30:41

Readmore >
Image 1

కాలినడక ద్వారా తిరుమలకు చేరిన 116 ఏళ్ల వృద్ధురాలు

Posted On 2026-07-05 17:09:50

Readmore >
Image 1

ఒవైసీ కాలేజ్ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్!!

Posted On 2026-07-05 17:08:44

Readmore >
Image 1

ఏలూరు జిల్లాలో విషాదం... రైలు ఢీకొని నలుగురి మృతి

Posted On 2026-07-05 11:44:43

Readmore >
Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >