| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఆరోగ్యమే మహాభాగ్యం : వైద్యాధికారి డాక్టర్ అరుణ

ఆరోగ్యమే మహాభాగ్యం : వైద్యాధికారి డాక్టర్ అరుణ

డైలీ భారత్, దమ్మన్నపేట:జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మన్నపేట యందు నేడు RBSK ( రాష్ట్రీయ బాల స్వస్త్య కార్యక్రమం) ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు వైద్య అధికారులు Dr. అరుణ, Dr.SK అఖిల్ మరియు పార్మశిష్టు A పవిత్ర ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అని పాటశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు శ్రీ బోయన్న గారి నారాయణ తెలిపారు ముందుగా విద్యార్థిని విద్యార్థులకు ఆరోగ్య విషయాలపై అవగాహన కల్పించడం జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు డబ్బు లేకపోయినా పర్వా లేదు కానీ ఆరోగ్యంగా ఉండాలని సూచించారు వ్యక్తిగత పరిశభ్రత మరియు పరిసరాల పరిశుభ్రత పాటించాలి  అని తెలిపారు ఫ్రైడే ( శుక్రవారం ) ను డ్రై డే గా పాటించాలని ఇంటి పరిసరాల్లో నీళ్లు నిలువ లేకుండా చూసుకోవాలని ప్రస్తుతము డెంగ్యూ మలేరియా వ్యాధులు ప్రభలుతున్నాయి కావున వాటి గూర్చి తల్లి తండ్రులకు తెలియ చేస్తూ నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు దోమ తెరలు వాడాలని సూచించారు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో మీరందరూ పాలుపంచుకోవాలని కోరారు


ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయులు తాడూరి సంపత్ కుమార్ మారేపల్లి రాజు గుడి కాడి కొమురయ్య శనిగరం నారాయణ అజ్మీర కవిత విద్యార్థులు పాల్గొన్నారు

Previous అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం ధర్మవరం మండల శాఖ అధ్యక్షుడిగా బైసాని హరి కుమార్
Next గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయం : జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి
ADVERTISEMENT