డైలీ భారత్, ప్రకాశం జిల్లా:ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండల శాఖ అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం అధ్యక్షుడిగా సమాధి కృష్ణ వర్మ ను నియమించినట్లు అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం జాతీయ కార్యవర్గ కమిటీ అధ్యక్షుడు అడ్వకేట్ వాండ్రాసి పెంచలయ్య పేర్కొన్నారు
ఈ సందర్భంగా సింగరాయకొండ మండల శాఖ అధ్యక్షుడిగా ఎన్నికైన కృష్ణ వర్మ మాట్లాడుతూ నిత్యం అయ్యప్ప భక్తుల అభ్యుదయానికి కృషి చేస్తూ అయ్యప్ప భక్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అలాగే అఖిలభారత అయ్యప్ప భక్తుల సంఘం బలోపేతం చేస్తానని తనను మండల అధ్యక్షుడిగా నియమించిన జాతీయ కార్యవర్గ కమిటీ అధ్యక్షుడు అడ్వకేట్ వాండ్రాసి పెంచలయ్య కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.