| Daily భారత్
Logo




ప్రభుత్వ టీచర్లకు బిగ్ షాక్... ఆఖరి ఆశలు గల్లంతు

News

Posted on 2025-10-21 17:30:22

Share: Share


ప్రభుత్వ టీచర్లకు బిగ్ షాక్... ఆఖరి ఆశలు గల్లంతు

ప్రభుత్వ టీచర్లకు బిగ్ షాక్ తగిలింది. టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్‌ను NCTE రిజెక్ట్ చేసింది. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో రెండేళ్లలో తప్పనిసరిగా టెట్ క్వాలిఫై కావాల్సిన పరిస్థితి ఏర్పడింది

డైలీ భారత్, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న టీచర్లకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (NCTE) షాక్ ఇచ్చింది. ఇప్పటికే సర్వీసులో ఉన్న ప్రభుత్వ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలన్న వినతిని NCTE తిరస్కరించింది. ఐదేళ్లకు మించి సర్వీసు ఉన్నవారంతా 2 ఏళ్లలో టెట్ పాసవ్వాల్సిందేనని ఇటీవల సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. 2017 పార్లమెంట్ తీర్మానం ప్రకారం ఈ తీర్పు ఇచ్చినందున.. అంతకుముందు నియమితులైన వారికి వర్తింపచేయరాదని టీచర్లు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలిని ఆశ్రయించారు. అయితే సుప్రీం తీర్పు నేపథ్యంలో NCTE వారి అభ్యర్థనను తిరస్కరించింది. ఈ నిర్ణయంతో లక్షలాది మంది ఉపాధ్యాయులు తమ భవిష్యత్ గురించి కొత్త ఆందోళన చెందుతున్నారు.

ఈ వివాదం సుప్రీంకోర్టు తీర్పుతో ప్రారంభమైంది. ఐదేళ్ల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్న అందరూ ఉపాధ్యాయులు కచ్చితంగా టెట్ క్వాలిఫై కావాల్సిందేనని సుప్రీం స్పష్టం చేసింది. రెండేళ్లలో టెట్ పాస్ అవ్వాలని ఆదేశించింది. ఒకవేళ టెట్‌కు క్వాలిఫై అవ్వకపోతే ఉపాధ్యాయులు తప్పనిసరిగా పదవీ విరమణ చేసి.. సర్వీసు నుంచి తొలగిస్తామని ఆదేశించింది. దీంతో ఉపాధ్యాయులు ఉద్యోగ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలిని ఆశ్రయించగా.. అక్కడ కూడా నిరాశే ఎదురైంది.

2017 సవరణలో చేసిన నిబంధనల మాదిరిగానే.. 2017 కి ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్‌ మినహాయింపు నుంచి ఇవ్వాలని NCTE ని కోరారు. ఈ ఉత్తర్వులు అమలుతో విద్యా వ్యవస్థలో తీవ్ర సంక్షోభానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. లక్షలాది మంది ఉపాధ్యాయులు తరగతి గదిలో బోధించడం కంటే.. తమ ఉద్యోగాలను కాపాడుకోవడానికి టెట్‌కు సిద్ధమవ్వడంపై దృష్టిపెడతారని.. దీంతో విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని వాదించారు. ఉద్యోగ పోతుందనే భయంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతారని.. ఇది వారి బోధనా పనితీరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని పిటిషనర్ల తరుఫున వాదనలు వినిపించారు. అయితే అన్ని ఊహాగానాలకు ముగింపు పలుకుతూ.. ఈ పిటిషన్‌ను అధికారికంగా  NCTE కొట్టిపడేసింది. ఈ కేసుకు ముగింపు పలుకుతున్నట్లు స్పష్టం చేసింది

Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 08:04:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 19:39:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 19:32:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 19:30:41

Readmore >
Image 1

కాలినడక ద్వారా తిరుమలకు చేరిన 116 ఏళ్ల వృద్ధురాలు

Posted On 2026-07-05 17:09:50

Readmore >
Image 1

ఒవైసీ కాలేజ్ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్!!

Posted On 2026-07-05 17:08:44

Readmore >
Image 1

ఏలూరు జిల్లాలో విషాదం... రైలు ఢీకొని నలుగురి మృతి

Posted On 2026-07-05 11:44:43

Readmore >
Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >
Image 1

అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-07-04 14:03:34

Readmore >