Posted on 2025-10-20 22:16:38
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:విధి నిర్వహణలో నేరస్థుడైన షేక్ రియాజ్ చేతిలో కత్తి పోట్లకు బలి అయిన కానిస్టేబుల్ ప్రమోద్ ఆత్మకు శాంతి కలగాలని హిందూ సంఘాల ఐక్యవేదిక నాయకులు పటేల్ ప్రసాద్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తూ నివాళులు అర్పించారు. కానిస్టేబుల్ ప్రమోద్ తన కుటుంబ భవిష్యత్తు కోసం ఎన్ని కలలు కని ఉంటాడో అతని కలలన్నీ నెరవేరకుండానే ఆ కానిస్టేబుల్ హత్యకు గురి కావటం అత్యంత బాదాకరం అన్నారు. షేక్ రియాజ్ అనే ఉన్మాది, పాత నేరస్తుడు,ఒక దొంగ,ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నేరాలు చేసి తప్పించుకుని తిరుగుతున్నాడని అతని వలన ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యగా అతనిని పట్టుకోవటానికి వెళ్లిన కానిస్టేబుల్ ప్రమోద్ ను నిజామాబాద్ నగరం నడిబొడ్డున నేరస్తుడు రియాజ్ కానిస్టేబుల్ ప్రమోద్ ను కత్తి తో దాడి చేసి అత్యంత కిరాతకంగా హత్య చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్య చేసిన నేరస్తుడు రియాజ్ ను ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేయడం జరిగిందన్నారు. రియాజ్ అనే నేరస్తుడు సమాజంలో ప్రాణాలతో ప్రజల మధ్య తిరుగుతే ఎంతో ప్రమాదం అలాంటి నేరస్తుడు అయిన రియాజ్ ను ఎన్కౌంటర్ చేసిన పోలీస్ వారికి సి. పి సాయి చైతన్యకి ధన్యవాదాలు తెలిపారు. సమాజంలో రియాజ్ లాంటి నేరస్తులను కనిపెట్టి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను కోరారు.
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >
కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు
Posted On 2026-07-04 13:59:26
Readmore >