Posted on 2025-10-20 22:17:49
నిజామాబాద్ సిపి సాయి చైతన్య వెల్లడి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వఆసుపత్రిలో ఖైదీ వార్డులో (ఐసో లేషన్ వార్డు) లో చికిత్స పొందుతున్న సమయంలో రియాజ్ ముందుగా హస్పీటల్ అద్దాలను ధ్వంసం చేశాడు.
సౌండ్ గమనించిన అదే సమయంలో రెగ్యూలర్ తనిఖీలలో బాగంగా ఎఆర్ పోలీసులు ప్రిజనరీ వార్డును తనిఖీ చేసేందుకు వచ్చారు. అప్పుడు అక్కడికి చేరుకున్న రిజర్వ్ సిబ్బంది రియాజ్ ను వారించారు. కాని వారిని పట్టించుకోకుండా ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీని లాక్కున్నాడు. తుపాకిని పారేయాలని పోలీసులు చెబుతున్న వినకుండా తుపాకీ తో కాల్చేందుకు ( ట్రిగ్గర్ నొక్కేందుకు) ప్రయత్నించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఏ ఆర్ ఎస్ ఐ ఆత్మ రక్షణార్థం జరిగిన కాల్పులలో రియాజ్ ఖతం అయ్యాడు అని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం జిల్లా జనరల్ ఆసుపత్రిలో జరిగిన రియాజ్ ఎన్ కౌంటర్ పై పోలీస్ కమిషనర్ సాయి చైతన్య విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ తప్పనిసరి పరిస్థితులలోనే కాల్పులు జరపడం జరిగిందని అందులోనే రియాజ్ హతం అయ్యారని అన్నారు. రియాజ్ కిందపడి తిరిగి లేవ లేదని తెలిపారు. ఇందుకు సంబంధించిన కేసు నమోదు చేయడం జరుగుతుందని దీనిపై విచారణ జరుపుతామని తెలిపారు. రియాజ్ ఎన్ కౌంటర్ కు గల కారణాలు విచారణలో తేలుతాయని తెలిపారు. ఈ విలేఖరుల సమావేశంలో అదనపు డిసీపీ బస్వారెడ్డి తదితరులు పాల్గోన్నారు.
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >
కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు
Posted On 2026-07-04 13:59:26
Readmore >