డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:కామారెడ్డి జిల్లాలో ఇవాళ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. బిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై కామారెడ్డి నుంచి రామాయంపేట వైపు బైక్ పై వెళ్తున్న వారిని రాంగ్ రూట్లో ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News
కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి